Friday, September 30, 2022
Homeటాప్ స్టోరీస్జాన్వీక‌పూర్‌ 39 కోట్ల ఫ్లాట్ కొందా?

జాన్వీక‌పూర్‌ 39 కోట్ల ఫ్లాట్ కొందా?

జాన్వీక‌పూర్‌ 39 కోట్ల ఫ్లాట్ కొందా?
జాన్వీక‌పూర్‌ 39 కోట్ల ఫ్లాట్ కొందా?

అతిలోక‌సుంద‌రి శ్రీ‌దేవి గారాల ప‌ట్టి జాన్వీ క‌పూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మూడేళ్ల‌వుతోంది. `ధ‌డ‌క్‌` చిత్రంతో బాలీవుడ్‌లోకి తెర‌గేట్రం చేసింది. `సైరాఠ్` రీమేక్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పెద్ద‌గా ప్ర‌భావాన్ని జాన్వీలోని ఒరిజినాలిటీని చూపించ‌లేక‌పోయింది. ఆ త‌రువాత రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌లో మాత్ర‌మే న‌టించిన జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం రెండు చిత్రాల్లో న‌టిస్తోంది.

- Advertisement -

రాజ్ కుమార్ రావుతో `రూహి అఫ్జానా` కార్తిక్ ఆర్య‌న్ న‌టిస్తున్న `దోస్తానా` సీక్వెల్ `దోస్తానా 2`లో న‌టిస్తోంది. కొన్ని వాణిజ్య బ్రాండ్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ‌ర్క్ చేస్తోంది. అయితే ఇంత త‌క్కువ టైమ్‌లో భారీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకోని జాన్వీ క‌పూర్ 39 కోట్లతో స‌క‌ల సౌక‌ర్యాలుగ‌ల ఫ్లాట్‌ని సొంతం చేసుకోవ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని షాక్‌కు గురిచేస్తోంది. దీంతో ఇంత మొత్తం జాన్వీకి ఎలా వ‌చ్చింది? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు విస్తూ పోతున్నార‌ట‌.

మ‌రి జాన్వీ క‌పూర్‌కి ఇంత పెద్ద మొత్తం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఎవ‌రి ద్వారా వ‌చ్చింద‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ముంబై రిచ్ ఏరియా జుహూలో జాన్వీ 39 కోట్లు వెచ్చించి అత్యంత ఖ‌రీదైన ఫ్లాట్‌ని సొంతం  చేసుకుంది. గ‌త కొంత కాలంగా తండ్రి బోనీ క‌పూర్‌, చెల్లి ఖుషీ క‌పూర్‌తో క‌లిసి లోఖండ్‌వాలాలో వుంటోంది. అయితే అక్క‌డి నుంచి సొంత ఫ్లాట్‌లోకి మారాలిన చాలా కాలంగా ఎదురుచూస్తోంద‌ట‌. ఇప్ప‌టికి టైమ్ రావ‌డంతో ముంబై పాష్ ఏరియా జుహూలో ఫ్లాట్‌ని సొంతం చేసుకుంద‌ని చెబుతున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts