Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడా

పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడా

janasena ready to contest telangana and apరెండు తెలుగు రాష్ట్రాలలో 2019 లో జరిగే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ ప్రకటించింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల ముందు జనసేన రాజకీయ పార్టీ ని స్థాపించిన విషయం తెలిసిందే . అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం – బిజెపి కూటమి కి మద్దతు ఇచ్చాడు కట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తో తీవ్రంగా విబేధిస్తున్నాడు పవన్ కళ్యాణ్ .

గతకొంత కాలంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎన్నికల వేడి పుట్టించాడు పవన్ కళ్యాణ్ . వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటికే కొంతమందికి సంకేతాలు ఇచ్చాడట ! అయితే ఇప్పుడున్న పరిస్థితి వేరు , ఎన్నికల నాటికి ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చూడాలి . అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే ఇక్కడ తెలంగాణ లో కూడా మొదట కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు పవన్ కానీ సడెన్ గా యు టర్న్ తీసుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం అందరినీ షాక్ కి గురిచేసింది . తెలంగాణ లో కూడా జనసేన పోటీ చేస్తుందని అంటున్నాడు పవన్ అయితే తెలంగాణ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ జనసేన పార్టీ నిర్మాణమే జరగలేదు . కేవలం అభిమానులతో పాటు కొంతమంది యువత మాత్రమే పవన్ వెంట నడుస్తున్నారు …… ఓట్లు రావాలంటే ఎన్నికల్లో గెలవాలంటే అది సరిపోదు .జనసేన ని గ్రామీణ స్థాయి నుండి బలోపేతం చేయకుండా పవన్ తప్పుచేస్తున్నాడా ? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు . అయినా జనసేన రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తుందని అంటున్నారు అంటే జనసేన వ్యూహం ఏంటో మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All