
రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భాంగా విజయవాడ వారథిపై అభిమానులు , జనసేన కార్య కర్తలు ఏర్పటు చేసిన పవన్ కళ్యాణ్ ప్లెక్సీ లను పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ , పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌కి, ఫ్లెక్సీల తొలగింపునకు ఏం సంబంధం.. మీరు తప్పు చేస్తున్నారు.. అసలు మీకు హక్కు ఉందని మా పార్టీ కార్యకర్తలు పెట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు.. రేపు ఆవిర్భావ దినోత్సవం ఆ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నాం.. మీరు రూల్స్ అతిక్రమిస్తున్నారు” అంటూ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న విజయవాడ నేత పోతిన మహేష్..అక్కడికి చేరుకొని పోలిసుల తీపి నిప్పులు చెరిగారు. అధికార పార్టీకి ఒకలా.. తమకు ఒకలా రూల్స్ ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు. ‘పోలీసులే కాపలా కాస్తూ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు.. పవన్ కల్యాణ్ అన్నా.. జనసేన అన్నా జగన్‌కి ఎందుకంత వణుకు.. రేపు జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మా సత్తా ఏంటో చూపిస్తాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక రేపు ఇప్పటం గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ మహా సభ జరగనుంది.