Homeరివ్యూస్జై సింహా రివ్యూ

జై సింహా రివ్యూ

నటీనటులు : నందమూరి బాలకృష్ణ , నయనతార , నటాషా , హరిప్రియ
సంగీతం : చిరంతన్ భట్
నిర్మాత : సి . కళ్యాణ్
దర్శకత్వం : కే ఎస్ రవికుమార్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 12 జనవరి 2018
నటసింహం నందమూరి బాలకృష్ణ సంక్రాంతి మొనగాడు అన్న బిరుదు ఉండనే ఉంది దాంతో అతడి సంక్రాంతి చిత్రానికి ఎక్కడలేని క్రేజ్ వస్తుంది . తాజాగా తమిళ దర్శకులు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి . కళ్యాణ్ నిర్మించిన జై సింహా చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది . నయనతార , నటాషా , హరిప్రియ లు నాయికలుగా నటించిన ఈ చిత్రం తో మరోసారి సంక్రాంతి రారాజుగా బాలయ్య నిలిచాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .
కథ :
ఏడాది వయసున్న తన కొడుకుతో బ్రతుకు దెరువు కోసం తమిళనాడు లోని కుంభకోణం కు వెళ్తాడు నరసింహం ( బాలకృష్ణ ) . కుంభకోణం లో గుడి ధర్మకర్త మురళీశర్మ ( మురళీమోహన్ ) ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తుంటాడు నరసింహం . అయితే చేయని నేరాన్నీ ఒప్పుకొని కుంభకోణం రౌడీ కనియప్పన్ ( కాలకేయ ప్రభాకర్ ) చేతిలో దెబ్బలు తింటాడు నరసింహం . కుంభకోణం లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గొడవలకు దూరంగా అక్కడి నుండి వెళ్లిపోవాలని అనుకుంటాడు నరసింహం , అయితే తన కొడుకుని కనియప్పన్  కిడ్నాప్ చేసాడను కొని భ్రమించి కనియప్పన్ మనుషులను చితగ్గొడతాడు నరసింహం కానీ తీరా సమయానికి అతడు కాపాడింది తన కొడుకుని కాదని తెలుసుకొని షాక్ అవుతాడు నరసింహం . అసలు నరసింహం ఎవరు ? కుంభకోణం కు ఎందుకు వచ్చాడు ? తన కొడుకు లాగే మరొకరు ఎలా ఉన్నారు ? ఇత్యాది విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
హైలెట్స్ :
నందమూరి బాలకృష్ణ పంచ్ డైలాగ్స్
బాలయ్య డ్యాన్స్
ఇంటర్వెల్ బ్యాంగ్
డ్రా బ్యాక్స్ :
ఎంటర్ టైన్ మెంట్
రొటీన్ డ్రామా
నటీనటుల ప్రతిభ :
నటసింహం నందమూరి బాలకృష్ణ కు ఇటువంటి పాత్రలు కొట్టినపిండి , అతడి గురించి , బాలయ్య నటన గురించి కొత్తగా చెప్పేదేముంది చింపి పడేసాడు నరసింహం పాత్రని . అమ్ముకుట్టి డ్యాన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు బాలయ్య . ఎమోషనల్ సీన్స్ లో కూడా బాలయ్య నటనకు ఫిదా కావలసిందే . ఇక బాలయ్య డైలాగ్స్ చెబుతుంటే అవి డైనమైట్ లా పేలుతుంటే థియేటర్ లో ఈలలే ఈలలు గోలలే గోలలు . నయనతార – బాలయ్య జోడి కనువిందు గా ఉంది , నయనతార కు మరోసారి మంచి పాత్ర లభించింది  , నటనతో పాటు మరింత గ్లామర్ గా కనిపించింది . ఇక మిగిలిన ఇద్దరు భామలు హరిప్రియ , నటాషా లు గ్లామర్ తో అలరించారు . ప్రకాష్ రాజ్ , మురళీమోహన్ , కాలకేయ ప్రభాకర్ , అశుతోష్ రానా లు తమతమ పాత్రలకు న్యాయం చేసారు …… అయితే సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం మరోసారి నిరాశపరిచాడు .
సాంకేతిక వర్గం :
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో బాలయ్య తో జతకట్టిన చిరంతన్ భట్ మరోసారి బాలయ్య తోనే పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రానికి పనిచేసి భేష్ అనిపించాడు . ఛాయాగ్రహణం కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది , ఎడిటింగ్ లో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది , నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి . ఇక దర్శకుడి విషయానికి వస్తే …… కథ లో కొత్తదనం లేదు కథనంలో కూడా కొత్తదనం లేదు కానీ బాలయ్య సినిమాలో ఏమి ఉండాలో వాటిని మాత్రం మిస్ చేయకుండా అభిమానులను అలరించేలా కమర్షియల్ ఎంటర్ టైనర్ ని అందించాడు రవికుమార్ . అయితే కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు మాత్రం నిరాశపడటం ఖాయం .
ఓవరాల్ గా :
బాలయ్య నుండి కోరుకునే ఫక్తు కమర్షియల్ సినిమా ఈ జై సింహా .
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All