
ఇదివరకే జబర్దస్త్ నుండి ప్రముఖులు తప్పుకుంటున్నారని, మరో ప్రముఖ ఛానల్ లో జబర్దస్త్ కు పోటీగా మరో షో మొదలవుతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈటీవీలో గత కొన్నేళ్లుగా జబర్దస్త్ దే రాజ్యం. అసలు ఈ కమెడియన్లు అందరూ ఈటీవీని బతికేస్తున్నారు అంటే అతిశయోక్తి లేదు. ఏదైనా పండగ వచ్చిందంటే జబర్దస్త్ కమెడియన్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు.
ఇంతమంది కమెడియన్లు జబర్దస్త్ వల్లే వెలుగులోకి వచ్చారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శీను, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, రాకెట్ రాఘవ తదితరులు జబర్దస్త్ వల్లే పాపులర్ కమెడియన్లు అయ్యారు. అందరూ ఇళ్ళు కూడా కట్టుకునేంత కూడబెట్టుకున్నారంటే జబర్దస్త్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు జబర్దస్త్ కు పోటీగా మరొక షో రాబోతోంది. జీ తెలుగులో ఈ షోకు రూపకల్పన ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పటికే నాగబాబు జడ్జిగా జబర్దస్త్ కు బై చెప్పేసి జీ తెలుగుకు వెళ్తున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది. రోజా మాత్రం జబర్దస్త్ తోనే కంటిన్యూ అవ్వనుంది. ఇప్పుడు నాగబాబుకు పోటీగా ఎవరిని పెడితే బాగుంటుంది అని జబర్దస్త్ యాజమాన్యం ఆలోచిస్తోంది.
ఈటివితో మంచి అనుబంధం ఉన్న అలీని సంప్రదించారు కానీ అలీ చాలా బిజీగా ఉన్నాడు. కుదురుతుందో లేదో గ్యారంటీ ఇవ్వలేదు. అందుకే ప్రత్యామ్నాయాలు వెతుకుంటున్నారు. సాయి కుమార్ ను కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఏమన్నారు అన్న దానిపై ఎటువంటి సమాచారం లేదు. ఇక బండ్ల గణేష్ ను అనుకుంటున్నారట. అయితే జడ్జిగ్గా బండ్ల గణేష్ అంటే బాగుంటుందా అసలు ప్రేక్షకులు ఏమనుకుంటారు అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో నాగబాబుకు రీప్లేస్మెంట్ ఎవరనేది తెలిసిపోతుంది.
ఇక జీ తెలుగులో రూపొందుతున్న షో లో ధనరాజ్, వేణు మళ్ళీ స్కిట్లు వేస్తారట. వీరికి చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ కూడా కలుస్తున్నట్లు తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ అండ్ బ్యాచ్ ను లాగడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అంతగా పని అవ్వట్లేదు. చూడాలి మరి ఈ షో లో ఎవరెవరు పాల్గొంటారో, జబర్దస్త్ ను ఎవరు వీడతారో!