Homeటాప్ స్టోరీస్“జాను” కోసం వర్షాన్ని సైతం లెక్క చెయ్యని జనం

“జాను” కోసం వర్షాన్ని సైతం లెక్క చెయ్యని జనం

Jaanu movie highlights
Jaanu movie highlights

శర్వానంద్ & సమంత జంటగా నటించిన సినిమా “జాను.” ఈ సినిమా తమిళ 96 కు రీమేక్. తమిళంలో 96 కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ గారే తెలుగులో కూడా ఈ సినిమాకు డైరెక్షన్ చేసారు. ఒక స్కూల్ బ్యాచ్ మళ్ళీ తిరిగి కలుసుకునే గెట్ టు గెదర్ సందర్భంగా గతంలో ప్రేమించుకున్న ఒక జంట నేపధ్యంలో ఈ సినిమా సాగుతుంది. తమిళంలో త్రిష మరియు విజయ్ సేతుపతి చేసిన పాత్రలలో ఇప్పుడు శర్వానంద్ మరియు సమంత కనిపిస్తున్నారు. మాతృక కు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత ఈ సినిమాకు కూడా పని చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలు, మరియు ట్రైలర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు తీసుకు వచ్చాయి.

ఆల్రెడీ ఒక బాషలో సూపర్ హిట్ అవ్వడంతోపాటు, పాన్ ఇండియా లెవల్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాను మళ్ళీ అంతే భారీ స్థాయిలో ఎమోషన్ మిస్ అవ్వకుండా తియ్యడం అంటే జోక్ కాదు. కానీ దిల్ రాజు గారు ఒక నిర్మాత గా మాత్రమె కాకుండా, ఒక క్రియేటర్ గా, ఒక మేకర్ గా మళ్ళీ తెలుగులో 96 మ్యాజిక్ రీ క్రియేట్ చేస్తారనిపిస్తోంది. ఇక ఈ మధ్యనే చిత్ర యూనిట్ వైజాగ్ రఘు కాలేజ్ లో హాజరైన ప్రచార కార్యక్రామానికి అభిమానుల, ముఖ్యంగా యువత నుండి భారీ స్పందన వచ్చింది. పెద్ద వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా కార్యక్రమానికి వచ్చిన ఫ్యాన్స్ ని చూసి చిత్ర యూనిట్ ఎంతో ఎమోషన్ కు లోనయ్యారు. చిత్ర పి.ఆర్ టీం విడుదల చేసిన ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All