Homeటాప్ స్టోరీస్జాను దర్శకుడి వెనుక థ్రిల్లింగ్ కథ!

జాను దర్శకుడి వెనుక థ్రిల్లింగ్ కథ!

జాను దర్శకుడి వెనుక థ్రిల్లింగ్ కథ!
జాను దర్శకుడి వెనుక థ్రిల్లింగ్ కథ!

జాను చిత్రంతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సి ప్రేమ్ కుమార్. స్వతహాగా కెమెరా మ్యాన్ అయిన ప్రేమ్, తమిళంలో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన 96 చిత్రంతో దర్శకుడిగా మారాడు. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దిల్ రాజు పట్టుబట్టి ఆ దర్శకుడికే జాను సినిమా బాధ్యతలు అప్పగించారు. చాలా హృద్యమైన ప్రేమకథను ఎంతో నిజాయితీగా చెప్పడంటూ ప్రేమ్ కుమార్ కు తెలుగు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ దర్శకుడి వెనకాల చాలా ఆసక్తికరమైన కథ ఉంది. దాన్నుండి ఒక సినిమా కూడా వచ్చిందంటే నమ్మగలమా?

తెలుగులో కొన్నేళ్ల కిందట పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ అంటూ ఒక సినిమా వచ్చిన సంగతి గుర్తుందా. సినిమా ఆడలేదు కాబట్టి గుర్తుండి ఉండదు కానీ ఈరోజుల్లో సినిమాతో హీరోగా మారిన శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. నిజానికి ఈ సినిమా ఒక రీమేక్. ప్రస్తుతం కోలీవుడ్ సెన్సేషన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన నడువుల కొంజెం పక్కత్త కానోమ్ చిత్రానికి రీమేక్ ఆ సినిమా. ఇందులో హీరో క్రికెట్ ఆడుతూ అనుకోకుండా పడిపోయి జ్ఞాపకశక్తి కోల్పోతాడు. అయితే తర్వాతి రోజు తన పెళ్లి, కానీ తనకు ఏదీ గుర్తుండదు. అయితే స్నేహితులు, రిలేటివ్స్ కలిసి ఎలాగోలా మ్యానేజ్ చేసి పెళ్లి జరిపిస్తారు. పెళ్ళైన తర్వాత ఒకరోజు పడుకుని లేచాక హీరోకు మళ్ళీ తిరిగి జ్ఞాపకశక్తి వస్తుంది. చాలా ఆసక్తికరంగా, ఆద్యంతం థ్రిల్లింగ్ గా నడిచే ఈ సినిమా తమిళంలో పెద్ద సెన్సేషన్. ఆ సినిమాకు కెమెరా మ్యాన్ గా ప్రేమ్ కుమార్ పనిచేసాడు.

- Advertisement -

అతడి రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకునే ఈ సినిమా తీశారు. నడువుల కొంజెం పక్కత్త కానోమ్ సినిమా ఆఖర్లో ఈ విషయాన్ని తెలియజేస్తారు కూడా. ఒక థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కు సరిపడా రియల్ లైఫ్ లో అనుభవించిన ప్రేమ్ కుమార్ తర్వాత ఎలాంటి సినిమా తీయనున్నాడోనని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All