Homeఎక్స్ క్లూసివ్నలుగురు హీరోల ఇళ్లపై దాడులు

నలుగురు హీరోల ఇళ్లపై దాడులు

IT rides on star heroes

కన్నడ చిత్ర రంగంలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్ళ ఇళ్ల పై ఐటీ దాడులు జరిగాయి . ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడులకు వచ్చేసరికి బిత్తరపోవడం హీరోల వంతయ్యింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన బెంగుళూర్ లో జరిగింది . కన్నడ స్టార్ హీరోలైన శివ రాజ్ కుమార్ ,పునీత్ రాజ్ కుమార్ , సుదీప్, యష్ ల ఇళ్ల పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు . వీళ్ళతో పాటుగా ప్రముఖ నిర్మాతలైన రాక్ లైన్ వెంకటేష్ , సీఆర్ మనోహర్ , విజయ్ కిరంగదూర్ ఇళ్ల లలో కూడా దాడులు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్ల ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ఐటీ అధికారులు కన్నడ చిత్ర పరిశ్రమలో దాడులు నిర్వహిస్తున్నారని తెలియగానే మిగతా వాళ్ళు అప్రమత్తమయ్యారు . కొందరికి భయంతో మరింత వణుకు మొదలయ్యింది . అయితే రెగ్యులర్ గా జరిగే దాడులుగానే పరిగణిస్తున్నారు ఐటీ అధికారులు . ఇక హీరోల ఇళ్ల పై దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు .

English Title: IT rides on star heroes

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All