Homeటాప్ స్టోరీస్రఫ్ఫాడిస్తున్న ఇస్మార్ట్ రామ్

రఫ్ఫాడిస్తున్న ఇస్మార్ట్ రామ్

రఫ్ఫాడిస్తున్న ఇస్మార్ట్ రామ్
రఫ్ఫాడిస్తున్న ఇస్మార్ట్ రామ్

ఎనర్జటిక్ స్టార్ రామ్ కు తన కెరీర్ లో చాలా స్పెషల్ చిత్రంగా ఇస్మార్ట్ శంకర్ గురించి చెప్పుకోవచ్చు. వరస ప్లాపులతో రామ్ కొట్టుమిట్టాడుతున్న వేళ పూరి జగన్నాథ్ తో జతకట్టిన రామ్ చాలా స్పెషల్ హిట్ ను అందుకున్నాడు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కలెక్షన్స్ విషయంలో ఇస్మార్ట్ శంకర్ ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ చేసిన విషయం తెల్సిందే. బయ్యర్లకు ఈ సినిమా పండగను తీసుకొచ్చింది. దాదాపు డబల్ లాభాలను అందించింది. రామ్ కెరీర్ కు కీలక మలుపుగా ఇస్మార్ట్ శంకర్ గురించి చెప్పుకోవచ్చు. అటు పూరి జగన్నాథ్ కెరీర్ కు కూడా ఈ చిత్రం బాగా హెల్ప్ అయింది. అసలు హిట్స్ అన్నదే లేకుండా పూరి స్టామినాను మరోసారి తెలియజేసిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.

ఇక మణిశర్మ కెరీర్ కు కూడా ఈ చిత్రం బాగా హెల్ప్ అయింది. ఈ సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మణిశర్మను మళ్ళీ టాలీవుడ్ కన్సిడర్ చేయడం ఈ చిత్రంతోనే తిరిగి మొదలైంది. ఇప్పుడు మళ్ళీ బడా సినిమాలకు పనిచేస్తున్నాడు మెలోడీ బ్రహ్మ. థియేట్రికల్ రన్ లోనే కాకుండా ఇస్మార్ శంకర్ టివి ప్రీమియర్ లో కూడా భీభత్సమైన టిఆర్పి తెచ్చుకుని ఆకట్టుకుంది.

- Advertisement -

ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ హిందీ డబ్ వెర్షన్ విడుదలైంది. యూట్యూబ్ లో ఈ సినిమాను ఆదిత్య మూవీస్ వాళ్లే రిలీజ్ చేసారు. పాటలు, కొన్ని అనవసర సీన్లు అనిపించనవి తీసేసి రెండున్నర గంటల సినిమాను రెండు గంటలకు కుదించి వదిలారు. ఇప్పుడు ఈ సినిమాకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా 32 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. గంటగంటకూ వ్యూస్ పెరిగిపోతున్నాయి. ట్రెండ్ ఇలాగే కొనసాగితే 100 మిలియన్ వ్యూస్ ను అందుకోవడం పెద్ద కష్టమేం కాబోదు. హిందీ ప్రేక్షకులకు ఈ మధ్య సౌత్ డబ్ సినిమాలపై ప్రేమ బాగా పెరిగింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All