Homeటాప్ స్టోరీస్ఇష్క్ @ 10 ఇయర్స్

ఇష్క్ @ 10 ఇయర్స్

నితిన్ – నిత్యా మీనన్ కలయికలో వచ్చిన ఇష్క్ మూవీ నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్, సుధాకర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో విక్రం కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 24 , 2012 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో ఇక నితిన్ సినీ కెరియర్ ముగిసినట్లే అని అంత అనుకుంటున్న సమయంలో ఇష్క్ మూవీ వచ్చి ఆయనకు ప్రాణం పోసింది.

- Advertisement -

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ , పీ. సీ. శ్రీరామ్ సినిమా ఫొటోగ్రఫీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. చక్కటి ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 28 కోట్లు వసూళ్లు చేసి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అంతే కాదు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు సొంతం చేసుకుంది. ఈ చిత్రం 2012 ఏప్రిల్ 13 నాటికి 50 రోజులు, 2012 జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని 11 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకొని , నితిన్ కెరియర్ లోనే ఓ మైలు రాయి చిత్రంగా నిలిచింది. 2012 నంది అవార్డు వేడుకల్లో ఉత్తమ కుటుంబ కథా చిత్రం, ఉత్తమ సహాయ నటుడు అవార్డ్స్ దక్కించుకుంది.

ఈ చిత్రం తరువాత వచ్చిన “గుండె జారి గల్లంతయ్యిందే…” సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మూడేళ్లు ప్లాప్ లు అందుకున్న నితిన్ ‘అ…ఆ’ చిత్రం తో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మరో రెండేళ్లు రెండు ప్లాప్ లు అందుకొని ’భీష్మ’ తో మళ్లీ హిట్ అందుకున్నాడు. ఇలా హిట్ , ప్లాప్ లు అందుకుంటూ కెరియర్ ను రాణిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All