Homeటాప్ స్టోరీస్దర్శకులు వివివినాయక్ తప్పు చేస్తున్నాడా ?

దర్శకులు వివివినాయక్ తప్పు చేస్తున్నాడా ?

vv vinayak
vv vinayak

మాస్ దర్శకులుగా వివివినాయక్ కు చాలా మంచి పేరు ఉంది , అయితే ఇటీవల దర్శకత్వం వహించిన సినిమాలు ప్లాప్ కావడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు . కట్ చేస్తే ఇప్పుడు హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నాడు . వివివినాయక్ ఏంటి ? హీరో ఏంటి ? అని అనుకుంటున్నారా ? నిజమే …….. అది కూడా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం .

శరభ అనే ప్లాప్ చిత్రానికి దర్శకత్వం వహించిన నరసింహారావు ఈ చిత్రానికి దర్శకుడు . వినాయక్ హీరోగా నటించడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల చాలామంది షాక్ అవుతున్నారు . అనవసరంగా హీరోగా నటిస్తున్నాడు , ఇప్పుడున్న పేరు చెడగొట్టుకోవడానికి చేజేతులా నిర్ణయం తీసుకున్నాడా ? అంటూ చర్చ జరుగుతోంది . అయితే పక్కాగా కథ , కథనం సెట్ అయితే హిట్ అవుతుంది , లేకపోతే వినాయక్ పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All