మెగా హీరో సాయి ధరం తేజ్ కు రీసెంట్ గా బైక్ యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ మీద బైక్ స్కిడ్ అవడంతో సాయి ధరం తేజ్ కిందపడటం తీవ్రంగా దెబ్బలు తగలడం తెలిసిందే. ఆ టైం లో సాయి ధరం తేజ్ హెల్మెంట్ పెట్టుకున్నాడు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అపోలోలో చికిత్స పొందుతున్న సాయి ధరం తేజ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అంటున్నారు.
ఓ మైనర్ సర్జరీ జరిగింది.. త్వరలోనే సాయి ధరం తేజ్ డిశ్చార్జ్ అవుతాడని అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ లో చెప్పారు. ఇదిలాఉంటే సాయి ధరం తేజ్ హెల్త్ గురించి రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ మళ్లీ మెగా ఫ్యాన్స్ ను ఆందోళన పడేలా చేస్తున్నాయి. సాయి ధరం తేజ్ బైక్ యాక్సిడెంట్ అయ్యి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే తాను ఈ ఈవెంట్ కు వచ్చానని చెప్పారు పవన్ కళ్యాణ్. అంతేకాదు సాయి ధరం తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు అని చెప్పారు పవన్.
సాయి ధరం తేజ్ కోమాలో ఉండటం ఏంటి.. ఒకవేళ స్ప్రుహ లో లేడు అన్న విషయాన్ని పవన్ అలా చెప్పారా.. లేక నిజంగానే సాయి ధరం తేజ్ హెల్త్ గురించి మెగా ఫ్యామిలీ ఏదైనా దాస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. మెగా సన్నిహిత వర్గాల నుండి కూడా ఈ విషయంపై క్లారిటీ మిస్ అవుతుంది. అయితే రిపబ్లిక్ ఈవెంట్ కు వచ్చిన సాయి ధరం తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ మాత్రం అన్నయ్య కోలుకుంటున్నారని చెప్పాడు.
