
లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్..ఫస్ట్ టైం తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కుతున్న లైగర్ మూవీ లో మైక్ టైసన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో భాగంగా మైక్ టైసన్ తన పాత్ర తాలూకా డబ్బింగ్ పూర్తి చేసాడు. కాగా ఈ మూవీ మైక్ టైసన్.. విజయ్ దేవరకొండ తండ్రిగా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.
ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు చిత్రసీమ కు పరిచయం కాబోతుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.