Homeగాసిప్స్రెడ్డి గారి అబ్బాయి గా మహేష్ బాబు ?

రెడ్డి గారి అబ్బాయి గా మహేష్ బాబు ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే . మహర్షి చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మహేష్ బాబు కున్న స్టార్ డంతో మంచి వసూళ్ల ని సాధిస్తోంది . ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ లో ఉన్న మహేష్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు .

- Advertisement -

పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 వంటి వరుస నాలుగు సూపర్ హిట్స్ కి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి తో తన తదుపరి చిత్రం చేయనున్నాడు మహేష్ , అయితే ఈ చిత్రానికి ” రెడ్డి గారి అబ్బాయి ” అనే టైటిల్ ని పెట్టనున్నట్లు తెలుస్తోంది . ఇదే టైటిల్ కాకుండా ” సరిలేరు నీకెవ్వరూ ” అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారు . అయితే అనిల్ రావిపూడి సినిమా అంటే వినోదాత్మకంగా ఉంటుంది కాబట్టి పైగా రాయలసీమ నేపథ్యం కాబట్టి ” రెడ్డి గారి అబ్బాయి ” అనే టైటిల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All