Homeగాసిప్స్పాపం పవన్ దెబ్బకు దిల్ రాజు ఏమైపోతాడో ..?

పాపం పవన్ దెబ్బకు దిల్ రాజు ఏమైపోతాడో ..?

 

Is Dil raju risk doing risk with pawan kalyan
Is Dil raju risk doing risk with pawan kalyan

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ విషయంలో కమిట్ అయ్యి దిల్ రాజు అనవసరమైన రిస్క్ చేస్తున్నాడా .? అవుననే అంటున్నారు తెలుగు ట్రేడ్ వర్గాలు. ఎన్నికల ముందు ఇక సినిమాలు చెయ్యను.” అన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు నా వృత్తి సినిమాలు, నేను చేసుకుంటే తప్పు ఏంటి.? అని ప్లేట్ మార్చేశాడు.

- Advertisement -

ఇక పవన్ కళ్యాణ్ “తొలి ప్రేమ” సినిమా స్ఫూర్తి తో ఇండస్ట్రీ కి వచ్చానని చెప్పుకునే దిల్ రాజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో బోణీ కపూర్ భాగస్వామ్యంలో “బదలా” సినిమా రీమేక్ చేస్తున్నాడు. “ఓ మై ఫ్రెండ్” సినిమా దర్శకుడు వేణు శ్రీరాం ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడు. ఇక సగం సినిమాలో దిల్ రాజు పైత్యం; మిగిలిన సగం పవన్ కళ్యాణ్ పైత్యం ఉంటుందని మనం ఫిక్స్ అయిపోవచ్చు.

అసలు ఈ సినిమా షూట్ ఎప్పుడు.? పవన్ నుండి ఎలాంటి క్లారిటీ లేకుండా, దిల్ రాజు అన్ని పనులు మొదలుపెట్టి చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజులు డేట్లు ఇచ్చాడని, 21 రోజులు మాత్రమే ఇచ్చాడని అందరూ అంటున్నారు. 50 కోట్లు రేమునరేషన్ అని ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు.

అసలు ఈ పరిస్థితిలో సినిమా చేసేంత సహనం, ఓపిక , ఫిట్ నెస్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయా.?

గతంలోనే పవన్ షూటింగ్ కి సరిగా రాకుండా విసిగించే రకం కదా .! మరి ఇప్పుడు అలాగే చెయ్యడని గ్యారంటీ ఏంటి.?

పవన్ కళ్యాణ్ మీద మోజులో దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడని సినిమా బిజినెస్ స్పెషలిస్ట్ లు అంటున్నారు

చూద్దాం ఏం జరుగుతుందో.?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All