Homeటాప్ స్టోరీస్“బయోపిక్” ల పేరుతో “భజన” సినిమాలు

“బయోపిక్” ల పేరుతో “భజన” సినిమాలు

“బయోపిక్” ల పేరుతో “భజన” సినిమాలు
“బయోపిక్” ల పేరుతో “భజన” సినిమాలు

అచ్చ తెలుగులో చెప్పాలంటే దృశ్య, శ్రవణ, ప్రసార, ప్రచార మాధ్యమాలు అన్నింటిలోనూ ఎంతో గొప్ప స్థానంలో ఉన్న కళ చలనచిత్రం. సింపుల్ గా చెప్పాలంటే విజువల్ మీడియాలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండే ఆర్ట్ పేరే సినిమా. మరి అలాంటి సినిమా కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులకు లోనవుతూ వస్తోంది. టెక్నాలజీ పరంగా ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్తున్న సినిమా కొంతకాలంగా కథా కథనం పరంగా అధఃపాతాళానికి వెళుతోందని చెప్పవచ్చు. మన దగ్గర బడ్జెట్ ఉండొచ్చు; స్టార్లు ఉండొచ్చు; టెక్నాలజీ ఉండొచ్చు; కానీ మంచి కథ లేకపోతే ఇవన్నీ ఉన్నా వేస్టే. ఇంత వరకు అందరూ ఒప్పుకుంటారు కదా.;

మరి ఎప్పటికప్పుడు విభిన్న కథలతో ప్రజలను ఆనందింప చేయడమే కాకుండా చైతన్యవంతం చేయాల్సిన అటువంటి సినిమా రానురాను కొంతమంది పెత్తందారుల భజన చేసి ప్రచారం చేయడానికి ఉపయోగపడే సాధనం గా మారిపోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల పుణ్యమా… అని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ తమ అధినేత యొక్క బయోపిక్ తీసి జనాల మీదకు వదిలారు సాధారణంగా ఒక సగటు మధ్యతరగతి మనిషి జీవితం లోనే వెలుగునీడలు ఉంటాయి. అలాంటిది, రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజకీయంగా పదవులకు ప్రాతినిధ్యం వహించిన నాయకులు జీవితంలో మనకు తెలియని ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. కానీ అవన్నీ దాచి పెట్టి కేవలం “తమ నాయకుడు దైవాంశ సంభూతుడు” అన్న విధంగా కొంతమంది సినిమాలు తీసి లేదా సినిమాలు తీయించి ఈ సినిమాకు ఉన్న గౌరవాన్ని కళ యొక్క గొప్పతనాన్ని కించపరుస్తూ ఉన్నారు.

- Advertisement -

ఈ సంవత్సరం చూసినట్లయితే స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంపై వచ్చిన కథానాయకుడు; మహానాయకుడు సినిమాలతో పాటు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై తెరకెక్కిన “యాత్ర” సినిమా అదేవిధంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జీవితంపై వచ్చిన “మోడీ” బయోపిక్ అంతకుముందు పనిచేసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన “యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” సినిమాలతో పాటు లక్ష్మీస్ ఎన్టీఆర్, ఇప్పుడు కొత్తగా “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమాలు కూడా ఉన్నాయి.

అప్పుడెప్పుడో తమిళనాడు రాజకీయాల ఆధారంగా దర్శకుడు మణిరత్నం “ఇద్దరు” సినిమా తీసినా, ప్రస్తుతం జయలలిత జీవితం ఆధారంగా “తలైవి”, “క్వీన్” అనే రెండు సినిమాలు వస్తున్నాయి. అదేవిధంగా తమిళ ప్రజల ఆరాధ్య నటుడు మరియు నాయకుడైన ఎంజీ రామచంద్రన్ జీవితం ఆధారంగా కూడా ఒక బయోపిక్ తీశారు.మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో శివసేన పార్టీ స్థాపకుడు బాల్ థాకరే జీవితం ఆధారంగా కూడా థాకరే అనే ఒక బయోపిక్ తీశారు. గతంలో ప్రజలు విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న నేపథ్యంలో ఆత్మకథ అనే పేరుతో పుస్తకాలు రాసి జనాలకు వదిలేవారు. ఇప్పుడు “బయోపిక్ ల పేరుతో భజన పిక్ లు” తీసి జనాల మీదకు వదులుతున్న వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All