
గత కొన్ని నెలలుగా యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే నందమూరి అభిమానులు , మెగా అభిమానులు సంబరాలకు సిద్ధమయ్యారు. థియేటర్స్ ను తమ అభిమాన నటుల కటౌట్స్ తో , ప్లెక్సీ లతో నింపేశారు. అలాగే పాలాభిషేకాలు , కాగితాలు విసిరేయడం కోసం కాగితాలను కట్ చేయడం , బాణా సంచల ఏర్పటు ఇలా ఎన్నో రెడీ చేసి ఉంచారు. అయితే అభిమానులంతా ఈ విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి.
థియేటర్ల యాజమాన్యాలకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా భయం పట్టుకుంది. మాములుగా ఓ పెద్ద హీరో నటించిన సినిమా రిలీజ్ రోజు హడావిడి ఎలా ఉంటుందో తెలియంది కాదు..స్క్రీన్ ముందు డాన్సులు వేయడం, కాగితాలు విసరడం , ఈలలు , గోలలు ఇలా నానా రచ్చ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా మెగా , నందమూరి హీరోలు కలిసి నటించిన సినిమా వస్తుండడం..అది కూడా రాజమౌళి డైరెక్షన్లో రావడం తో ఫస్ట్ డే ఏ రేంజ్ లో రచ్చ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అందుకే వీరిని అదుపు చేసేందుకు యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ప్రమాదకరమైన ఇనుప కంచెలు ఏర్పాటు చేసి ప్రేక్షకులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. శ్రీకాకుళంలోని సూర్యమహల్ థియేటర్‌లో తెర ముందు ఇనుప కంచెను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. లో క్లాస్ టిక్కెట్ల సీట్లు ఉండే చోట ఇనుప కంచె ఏర్పాటు చేయడంతో ప్రమాదాలకు ఆస్కారం ముంది. ఈ థియేటర్ తో పాటు మరికొన్ని చోట్ల ఇదే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అందుకే అభిమానులు జాగ్రత్తగా ఉండాలని అంత చెపుతున్నారు.