
బాలీవుడ్ మిస్టర్‌పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ కొత్త ప్రేమను వెతుక్కున్నట్టు తెలుస్తోంది. ఇరా ఖాన్ ప్రియుడు మిషాల్ కృపాలానీకి గత ఏడాది డిసెంబర్‌లో బ్రేకప్ చెప్పేసింది. అతనితో రెండేళ్ల పాటు డేటింగ్‌లో వున్న ఇరా ఖాన్ అతనికి గుడ్‌బై చెప్పేసింది. తరువాత కొంత విరామం తీసుకున్న ఇరా తాజాగా మరొకరితో ప్రేమలో పడినట్టుగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
అమీర్ ఖాన్ ఫిట్నెస్ కోచ్ నుపూర్ శిఖారేతో ఇరా ఖాన్ ప్రేమలో పడిందని తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో ఇరా ఖాన్ ఫిట్‌నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ సమయంలో నుపూర్ శిఖారే వద్ద ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకుంటోంది. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడ్డారని బాలీవుడ్ వర్గాల కథనం. నూపూర్ , ఇరా మహాబలేశ్వర్ లోని అమీర్ ఖాన్ ఫామ్ హౌస్ కు విహారయాత్రకు వెళ్లారట. ఇరా అతన్ని తన తల్లి రీనా దత్తాకు పరిచయం చేయడంతో వీరిద్దరి మధ్య వున్న అనుంధం నిజమనే ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
నుపూర్ శిఖారే దీపావళి సందర్భంగా ఇరాతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న క్షణాలకి సంబంధించిన ఓ ఫొటోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో వీరి ప్రేమ బంధంపై బాలీవుడ్‌లో వరుస కథనాలు మొదలయ్యాయి. నుపూర్ గత పదేళ్లుగా సుష్మితా సేన్, అమీర్ ఖాన్‌కు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా శిక్షణ ఇస్తున్నాడు.