Homeరివ్యూస్ఇంటలిజెంట్ రివ్యూ

ఇంటలిజెంట్ రివ్యూ

నటీనటులు : సాయిధరమ్ తేజ్ , లావణ్య త్రిపాఠి
సంగీతం : ఎస్ ఎస్ థమన్
నిర్మాత : సి . కళ్యాణ్
దర్శకత్వం : వివివినాయక్
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 9 ఫిబ్రవరి 2018

 

- Advertisement -

 

సాయి ధరమ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జంటగా వివివినాయక్ దర్శకత్వంలో సి . కళ్యాణ్ నిర్మించిన చిత్రం ” ఇంటలిజెంట్ ” . ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన తేజ ( సాయి ధరమ్ తేజ్ ) తన కంపెనీ యజమాని కూతురు ని ప్రేమిస్తాడు . నిజాయితీ కి మారుపేరైన తేజు యజమాని ని నిర్ధాక్షిన్యంగా చంపేస్తారు మాఫియా . దాంతో తన యజమాని ని చంపిన మాఫియా పై యుద్ధం ప్రకటిస్తాడు తేజు అలియాస్ ధర్మా భాయ్ . సాఫ్ట్ గా ఉండే తేజు ధర్మా భాయ్ గా ఎందుకు మారాడు ? తన యజమానిని చంపినా వాళ్ళ అంతు చూసాడా ? చివరకు ఏమైంది ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
సాయి ధరమ్ తేజ్ నటన
పోసాని ,30 ఇయర్స్ పృథ్వీ , రఘుబాబు , జెపి ల కామెడీ
లావణ్య గ్లామర్

డ్రా బ్యాక్స్ :

రొటీన్ స్టోరీ , రొటీన్ స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

సాఫ్ట్ వేర్ కుర్రాడిగా అలాగే ధర్మా భాయ్ గా మెగా మేనల్లుడు బాగా నటించాడు అలాగే డ్యాన్స్ లలో , ఫైట్స్ లలో మంచి ఈజ్ చూపించాడు . సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై మోశాడు సాయిధరమ్ తేజ్ . లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో మరింత గ్లామర్ గా కనిపించింది . అలాగే రీ మిక్స్ సాంగ్ ఫరవాలేదు . హాస్యం విషయానికి వస్తే …… పోసాని , జయప్రకాశ్ రెడ్డి , 30 ఇయర్స్ పృథ్వీ , రఘుబాబు , కాదంబరి కిరణ్ , ఫిష్ వెంకట్ లు ఉన్నది కొద్దిసేపే అయినప్పటికీ నవ్వులు పూయించారు . యధావిధిగా బ్రహ్మానందం ఈ సినిమాలో కూడా తేలిపోయాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు .

సాంకేతిక వర్గం :

ఆకుల శివ కథ పాత తరహా కథనే మళ్ళీ ఇచ్చాడు , కళ్యాణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి అలాగే ఎస్ ఎస్ థమన్ నేపథ్య సంగీతం ఫరవాలేదు పాటల విషయానికి వస్తే ….. చమకు చమకు చాం పాటని రీమిక్స్ చేసి మెగా ఫ్యాన్స్ కు సంతోషాన్ని అందించారు . ఇక దర్శకుడు వినాయక్ విషయానికి వస్తే అనుకున్న రేంజ్ లో స్క్రీన్ ప్లే సమకూర్చుకోలేక పోయాడు . రొటీన్ కథ , అంతే రొటీన్ స్క్రీన్ ప్లే తో పేలవంగా ముగించాడు అయితే అక్కడక్కడా కామెడీ ని పంచి మంచి రిలీఫ్ ఇచ్చాడు .

ఓవరాల్ గా :

ఇంటలిజెంట్ ని ఓసారి చూడొచ్చు

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All