Homeటాప్ స్టోరీస్ఇంతలో ఎన్నెన్ని వింతలో రివ్యూ

ఇంతలో ఎన్నెన్ని వింతలో రివ్యూ

ఇంతలో ఎన్నెన్ని వింతలో రివ్యూఇంతలో ఎన్నెన్ని వింతలో రివ్యూ:
నటీనటులు : నందు , సౌమ్యా వేణుగోపాల్ , పూజా రామచంద్రన్ తదితరులు
సంగీతం : యాజమాన్య
నిర్మాతలు : శ్రీకాంత్ రెడ్డి , రామ్మోహన్ రావు
దర్శకత్వం : వరప్రసాద్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 6 ఏప్రిల్ 2018

నందు ,సౌమ్యా వేణుగోపాల్ జంటగా పూజా రామచంద్రన్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ” ఇంతలో ఎన్నెన్ని వింతలో ”. వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి – రామ్మోహన్ రావు లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 6న విడుదల కానుంది అయితే సినిమాపై నమ్మకంతో రెండు రోజుల ముందుగానే ప్రీమియర్ షో వేశారు . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

హీరో నందు ,హీరోయిన్ సౌమ్య ప్రేమించుకుంటారు దాంతో ఆ వ్యవహారం పెళ్లి వరకు వెళుతుంది . పెళ్లి కుదరడంతో తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేస్తాడు నందు అయితే అనూహ్యంగా అక్కడ వ్యభిచారి అయిన తార ( పూజా రామచంద్రన్ ) కనిపిస్తుంది . మందు పార్టీ ఎంజాయ్ చేయాలనీ వచ్చిన వాళ్లకు కత్తిలాంటి ఫిగర్ కనిపించడంతో టెంప్ట్ అవుతారు వాళ్లతో ఆ సుఖం పొందడానికి తార కూడా సిద్దమై వెళ్లిపోతుంది . తార తో వెళ్ళిపోయాక ఎలాంటి పరిస్థితులు వెంటాడాయి ? పెళ్లి సమయానికి నందు వెళ్లాడా ? నలుగురు ఫ్రెండ్స్ కి వచ్చిన ఆపద ఏంటి ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ఎంటర్ టైన్ మెంట్
పూజా రామచంద్రన్
నందు
సౌమ్య
డైరెక్షన్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్ లో మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది

నటీనటుల ప్రతిభ :

చిన్నా చితక వేషాలు వేస్తూ అడపా దడపా హీరో వేషాలు వేస్తున్న నందు కు ఇంతలో ఎన్నెన్ని వింతలో మంచి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది . దర్శక నిర్మాతలు అతడి పై పెట్టుకున్న నమ్మకాన్ని తన పెర్ఫార్మెన్స్ తో అన్ని రకాల ఎమోషన్స్ ని పలికించగలనని నిరూపించుకున్నాడు . ఇక హీరోయిన్ సౌమ్య కు కూడా మంచి పాత్రే లభించింది, హీరో హీరోయిన్ ల కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యింది . ఇక కీలకమైన పాత్రలో పూజా రామచంద్రన్ అందాలతో కవ్వించడమే కాకుండా నటనతో మెప్పించింది . నందు స్నేహితులుగా నటించిన వాళ్ళు కూడా బాగా నవ్వించారు , ప్రేక్షకులను మెప్పించారు . విలన్ పాత్రధారి గగన్ మంచి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

మాస్ దర్శకులు వివివినాయక్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వరప్రసాద్ షార్ట్ ఫిలిం తో తన సత్తా ఏంటో నిరూపించుకొని ఇంతలో ఎన్నెన్ని వింతలో చిత్రంతో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి సిద్ధం అయ్యాడు . అదుర్స్ , కృష్ణ , వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రాలకు పనిచేసిన వరప్రసాద్ ఈ చిత్రాన్ని కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు . స్క్రీన్ ప్లే తో వరప్రసాద్ మ్యాజిక్ చేసాడు . సాలిడ్ హిట్ కాదు కానీ ఇంతలో ఎన్నెన్ని వింతలో సినిమాతో సక్సెస్ అయ్యాడు ఈ దర్శకుడు . ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు నిర్మాతలు . యాజమాన్య అందించిన పాటలు అలాగే నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది . మోహన్ రెడ్డి విజువల్స్ బాగున్నాయి .

ఓవరాల్ గా :

ఈ మండు వేసవిలో రెండున్నర గంటలు హాయిగా సినిమా చూడాలనుకునే వాళ్లకు చక్కని వినోదం ఈ ఇంతలో ఎన్నెన్ని వింతలో .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All