
పెద్ద బడ్జెట్ ఉన్న సినిమా ఇది.. కానీ నాకున్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఎంత అవసరమో అంత తీసుకొని డిజైన్ చేసుకున్నాము.. ఈ సినిమాలో నాతో పాటు నటించిన ముగ్గురు కూడా హీరోలనే చెప్పాలి. ఈ రోజు సాయంకాలం మొదలై రేపు ఉదయం వరకు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ. చాలా బాగొచ్చింది.. సినిమా ను ఇండస్ట్రీలోని కొంత మంది పెద్ద వారికి చూపించడం జరిగింది.. వారి సలహాలను కూడా తీసుకొని పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం సినిమా చేసాము. మర్చి నుంచి థియేటర్ బంద్ అంటున్నారు అది లేకుంటే మర్చి 2న విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాము అని తెలిపారు. దర్శకుడు వరప్రసాద్ మాట్లాడుతూ ఆడియో ను ఎఫ్ ఎమ్ ద్వారా విడుదల చేయనున్నాము.. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని ఆశిస్తున్నా అన్నారు. నిర్మాత ఎస్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాను సెన్సార్ వారు చూసి అభినందిస్తూ యు/ఏ సర్టిఫికెట్ ను అందించారు. చాలా సంతోషంగా ఉంది.. సినిమా చుసిన వారందరూ ప్రశంసిస్తున్నారు. విడుదలకు రెండు రోజుల ముందే ప్రెస్ వారికి ప్రివ్యూ వేయాలనుకుంటున్నాము అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.. మార్చ్ 1న బంద్ లేకపోతే ఈ చిత్రాన్ని మర్చి 2న విడుదల చేస్తున్నాము అని చెప్పారు.
వందన అనే రోల్ లో నటిస్తున్నా.. అందరూ బాగా సహకరించారు.. ఇంత మంచి సినిమాలో నేనొక భాగమైనందుకు సంతోస్తిస్తున్నా అని హీరోయిన్ సౌమ్య అన్నారు. పూజ రామచంద్రన్ మాట్లాడుతూ ఓవర్ నైట్ లో జరిగే స్టోరీ ఇది.. ఓ కీలక పాత్రలో నటిస్తున్నా.. వండర్ ఫుల్ స్క్రిప్ట్. క్యాచివ్ అండ్ గుడ్ టైటిల్. నిర్మాతలు చాలా కంఫర్టబుల్ పర్సన్స్.. అందర్నీ చాలా బాగా చూసుకున్నారు అని చెప్పారు. సినిమా లో నటించిన నటీనటులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది ఇది. ఆడియో, ఆర్ ఆర్ అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా స్టోరీ కు తగ్గట్టు త్రిల్లింగ్ గా అనిపిస్తుంది రీ రికార్డింగ్… అందరికీ తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నా అని మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య తెలిపారు..
గగన్ విహారి, లిరిక్ రైటర్ సురేష్, ఈరోజుల్లో సాయి, డి ఓ పి మోహన్, నటులు కృష్ణ తేజ, త్రిశూల్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను అభినందనలను తెలియచేసారు.
నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్, గగన్ విహారి, ఆర్ కె, మీనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్ మోహన్ రెడ్డి, ఎడిటర్: చోటా కె ప్రసాద్, సంగీతం: యాజమాన్య, మాటలు: కె వి రాజమహి, మధు శ్రీనివాస్ గోపాలుని, కొరియోగ్రఫీ: విఘ్నేశ్వర, లిరిక్స్: సురేష్ ఉపాద్యాయ, ఆర్ట్ : జిల్లా మోహన్, స్టంట్స్: మార్షల్ రమణ,
- Advertisement -