
మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా వరుస చిత్రాల్ని ప్రకటిస్తూ షాకిస్తున్నారు. యంగ్ హీరోలకు ధీటుగా ప్రాజెక్ట్‌లు ప్రకటించిన ఆయన మొత్తం నాలుగు చిత్రాల్ని లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` మూవీ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సిద్ధాగా కీలక అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఈ మూవీ అండర్ ప్రొడక్షన్‌లో వుండగానే మెగాస్టార్ మరో చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ మూవీని ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. మలయాళంలో మోహన్‌లాల్ పోషించిన పాత్రని తెలుగులో మెగాస్టార్ పోషిస్తున్నారు. ఇందులో ఈ పాత్ర కోసం వైట్ లుంగీ ధరించి చిరు కనిపిస్తారట.
ఇదిలా వుంటే త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ మూవీకి `రారాజు` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. స్టోరీకి, చిరు పాత్రకు తగ్గట్టుగా టైటిల్ వుండటంలో మేకర్స్ ఈ టైటిల్ నే ఫైనల్ చేయాలనే ఆలోచనలో వున్నారట. ఇందులోని కీలక పాత్రలో హీరో సత్యదేవ్ కనిపించనున్న విషయం తెలిసిందే. ఎన్‌వీ ప్రసాద్‌తో కలిసి ఆర్‌బీ చౌదరి, పరాస్ జైన్ ఈ మూవీని నిర్మించబోతున్నారు.