Homeటాప్ స్టోరీస్ఇండియన్ 2 షూటింగ్ తాజా అప్డేట్

ఇండియన్ 2 షూటింగ్ తాజా అప్డేట్

ఇండియన్ 2 షూటింగ్ తాజా అప్డేట్
ఇండియన్ 2 షూటింగ్ తాజా అప్డేట్

కొన్ని రోజుల క్రితం ఇండియన్ 2 షూటింగ్ స్పాట్ లో జరిగిన ప్రమాదం వల్ల ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ సంఘటనకు అటు ఇండియన్ 2 కాస్ట్ అండ్ క్రూ తో పాటు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దిగ్బ్రాంతికి గురయ్యాయి. ఈ సంఘటనతో ఇండియన్ 2 షూటింగ్ ను అర్ధాంతరంగా నిలిపివేశారు. దర్శకుడు శంకర్ కాలికి గాయాలు అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కమల్ హాసన్ మృతి చెందిన కుటుంబాలకు కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చాడు. అటు శంకర్, నిర్మాత, హీరోపై పోలీస్ కేసు నమోదై విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇండియన్ 2 షూటింగ్ ఎప్పుడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

భారీ తారాగణం పాల్గొంటున్న ఫిల్మ్ షూటింగ్ కావడంతో ఒక్క రోజు కాల్ షీట్స్ వేస్ట్ అయినా చాలా నష్టం వస్తుంది. షూటింగ్ లో పాల్గొంటోంది పేరున్న నటీనటులు కావడంతో కాల్ షీట్స్ ఇప్పుడు వేస్ట్ అయితే మళ్ళీ పట్టడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో ఇండియన్ 2 షూటింగ్ ను ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నారు. వీలయితే వచ్చే నెల మొదట్లోనే షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నారు. షూటింగ్ స్పాట్ లో జరిగిన ఘోరం ఇంకా కళ్ళ ముందు అలాగే ఉన్నా బాధను దిగమింగుకుని నిర్మాతల డబ్బుని వృధా చేయకూడదన్న ఉద్దేశంతో షూటింగ్ మొదలుపెట్టాలని టీమ్ మొత్తం కలిసి డిసైడ్ అయింది.

- Advertisement -

మరి కచ్చితంగా ఎప్పుడనేది ఇంకా తెలియలేదు. దానిపై ప్రకటన త్వరలో వచ్చే అవకాశముంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కాజల్ కమల్ సరసన హీరోయిన్ గా నటించగా రకుల్ ప్రీత్ సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట భావించారు కానీ ఇప్పుడు జరిగిన పరిణామాల అనంతరం ఎప్పుడు విడుదలవుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All