Homeటాప్ స్టోరీస్భారతీయుడికి అన్నీ ఇబ్బందులే

భారతీయుడికి అన్నీ ఇబ్బందులే

Indian 2 shooting breaks
Indian 2 shooting breaks

ఏ నిమిషాన సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ భారతీయుడు సీక్వెల్ ను అనుకున్నాడో కానీ అప్పటినుండి ఈ చిత్రానికి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. నిజానికి భారతీయుడు సీక్వెల్ ఆలోచన ఇప్పటిది కాదు. పదేళ్ల క్రితం నుండే శంకర్ కు ఈ ఆలోచన ఉంది. కానీ అప్పట్లో సెట్ అవ్వలేదు. మూడేళ్ళ క్రితం ఈ సీక్వెల్ పని ముందుకు కదిలింది. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమాను ప్రకటించారు. అయితే కొద్ది రోజుల ప్రయాణం తర్వాత దిల్ రాజు.. కారణం తెలీదు కానీ వెనక్కి తగ్గాడు.

ఆ తర్వాత శంకర్ చాలా ప్రయత్నాల తర్వాత తనతో 2.0 సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ నే ఒప్పించి భారతీయుడు సీక్వెల్ ను పట్టాలెక్కించాడు. ఈ సినిమా మొదలైనా కానీ అడ్డంకులు మాత్రం తొలగలేదు. సినిమా మొదలైన కొన్ని రోజులకే షూటింగ్ ఆగిపోయింది. అప్పట్లో ఈ బ్రేక్ పట్ల రకరకాల కారణాలు వినిపించాయి. బడ్జెట్ కారణాల వల్ల కొన్నాళ్ళు, కమల్ మేకప్ కోసం కొన్నాళ్ళు.. కమల్ హాసన్ పొలిటికల్ పార్టీ పెట్టడం వల్ల కొన్నాళ్ళు.. మొత్తం దాదాపు ఎనిమిది నెలల పాటు షూటింగ్ జరగలేదు.

- Advertisement -

ఏదైతేనేం ఈ మధ్యనే షూటింగ్ మొదలైంది. ఇక విరామం లేకుండా షూటింగ్ పూర్తి చేసి కనీసం వచ్చే ఏడాది వేసవి సమయానికల్లా సినిమాను విడుదల చేద్దామనుకుంటే ఇప్పుడు షూటింగ్ స్పాట్ లో జరిగిన ప్రమాదం వల్ల అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ అనుకోని సంఘటన వల్ల షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. ఇక ఒకవేళ మొదలైనా ఈ ఏడాది మొత్తం షూటింగ్ చేయాలి. అది ఎలాగు కుదరని పని. ఎందుకంటే మళ్ళీ తమిళనాడులో ఎన్నికలు వచ్చేస్తాయి. కమల్ హాసన్ ఎన్నికల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేద్దామనుకుంటున్నాడు.

ఇక ఈ బ్రేక్ వల్ల షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం మారిపోయాయి. స్టార్ యాక్టర్స్ డేట్స్ సమస్య తలెత్తుతుంది. మొత్తానికి ఇండియన్ 2 షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఆ దేవుడికే తెలియాలి అని తమిళనాట మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All