Homeటాప్ స్టోరీస్IMDB వరల్డ్ నెంబర్ 1 రికార్డ్ జై భీమ్ సొంతం..!

IMDB వరల్డ్ నెంబర్ 1 రికార్డ్ జై భీమ్ సొంతం..!

IMDB Rating Record for Surya Jai Bhim

సూర్య లీడ్ రోల్ లో జ్ఞానవెల్ డైరెక్ట్ చేసిన జై భీమ్ సినిమా ఐఎండిబి రేటింగ్స్ లో రికార్డ్ సృష్టించింది. ప్రపంచ సినిమాలకు ఐఎండిబి రేటింగ్స్ ఎంతో ప్రాధాన్యమని తెలిసిందే. కొన్ని సినిమాలు కమర్షియల్ గా ఆడకపోయినా ఐఎండిబి రేటింగ్స్ మాత్రం బాగా వస్తాయి. సినిమా ఎంత పెద్ద హిట్టైనా ఐ.ఎం.డి.బి రేటింగ్స్ మాత్రం 8 హయ్యెస్ట్ గా ఇచ్చారు. అప్పుడెప్పుడో 1994లో వచ్చిన షషాంక్ రెడెమ్షన్ కు ఐఎండిబి 9.3 రేటింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఐఎండివి జై భీమ్ కు 9.6 రేటింగ్ ఇచ్చింది. సౌత్ లోనే కాదు ఇండియాలోనే ఏ సినిమాకు ఈ రికార్డ్ రాలేదు.

- Advertisement -

వరల్డ్ వైడ్ గా ఐఎండిబి రేటింగ్స్ లో సూర్య జై భీమ్ నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం లాయర్ చంద్రు వారికి ఎలా న్యాయం జరిగేలా చేశాడు అన్నది సినిమా కథ. సినిమాలో కొన్ని సీన్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయి. చట్టం తలచుకుంటే ఎలాంటి వారికైనా శిక్ష పడేలా చేస్తుందని ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసారు.

సూర్య నటించడమే కాదు ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తప్పకుండా ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ సైతం వస్తుందని చెప్పొచ్చు. జ్ఞానవెల్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య స్వయంగా నిర్మించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All