Homeన్యూస్వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి మార్చి నవంబర్ 4 కు మార్చాలి -...

వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి మార్చి నవంబర్ 4 కు మార్చాలి – నందమూరి బాలకృష్ణ

వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి మార్చి నవంబర్ 4 కు మార్చాలి - నందమూరి బాలకృష్ణ
వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి మార్చి నవంబర్ 4 కు మార్చాలి – నందమూరి బాలకృష్ణ

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించాడు.GA2 పిక్చర్స్ లో అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, ఎమ్.విజయ్ కలిసి ఈ సినిమాను నిర్మించారు.ఈ మూవీ నవంబర్ 4న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర బృందం.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ..
శిరీష్ గారు, అను వాళ్లద్దరి వలన ఈ సినిమా షూటింగ్ చాలా స్మూత్ గా జరిగింది. శిరీష్ గారికి ఈ సినిమాలో ఉన్న కేరక్టర్ కి చాలా దూరం. శిరీష్ కి ప్రతి విషయంలోనూ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే శిరీష్ గారికి ఫుల్ క్లారిటీ ఉంటుంది.
శిరీష్ గారితో ట్రావెల్ లో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. శ్రీ కుమార్ అనే కేరక్టర్ పర్ఫెక్ట్ గా అర్ధం చేసుకుని ప్రెజెంట్ చేసారు.
అను చెప్పిన టైమ్ కు సెట్ వస్తుంది. ఈ టైటిల్ ఊర్వశివో.. రాక్షసివో కానీ, రియల్ లైఫ్ ఊర్వశిని అందరు అప్రీసెట్ చేస్తారు.
బాలకృష్ణ గారు మీ సమరసింహారెడ్డి సినిమా ఇండస్ట్రీకి రావడానికి కొంత ఉత్సాహం ఇచ్చింది. గీత ఆర్ట్స్ లో సినిమా చేయడం అనే వాల్యూ చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్టర్స్ తెలుసు. అరవింద్ గారు నాకు ప్రతి విషయంలోను ఫ్రీడమ్ ఇచ్చారు. అలానే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ ను కొనియాడారు.

- Advertisement -

అను ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ
ఇంత కంఫర్ట్ తో నేను ఏ సినిమా చెయ్యలేదు, ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్, నా పేరు ఎప్పుడు సినిమా పోస్టర్ లో చూడలేదు, కానీ నేను ఈరోజు హీరోతో పాటు చూస్తున్నాను.అది చాలా ఆనందంగా ఉంది.బన్నీ వాసు గారికి థాంక్యూ ఆయనే ఈ సినిమా కోసం నన్ను కలిసారు. టెక్నీషియన్స్ అందరికి చాలా థాంక్యూ. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి.

మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ
బాలయ్య గారు పిలిచిన వెంటనే ఈ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన చాలా సింపుల్ ఆటిట్యూడ్ తో ఉంటారు. సినిమా గురించి ఇప్పుడు మాట్లాడటం కంటే, ఈ సినిమా సక్సెస్ అయ్యాక మాట్లాడుతా. ఇక్కడికి వచ్చిన యంగ్ డైరెక్టర్స్ అందరికి నా కృతజ్ఞత. రాకేష్ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించావ్ థాంక్యూ. ఈ సినిమాకి బాక్గ్రౌండ్ లో బన్నీవాసు ఎంతో పనిచేసారు. అతను నా కొడుకు లాంటివాడు చిన్నగా థాంక్స్ చెప్తే బాగోదు. శిరీష్ గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాడిని, మధ్యతరగతి వాడిలా చూపించి ఒప్పించాడు దర్శకుడు. ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ తప్పకుండా చూడండి.

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ…
ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికి చాలా థాంక్యూ. డైరెక్టర్ రాకేష్ గారితో వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసాక మీకు అర్ధమవుతుంది ఈ సినిమా ఎంత బాగా తీసారని.
అలానే సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కి, నటులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి. నేను మా నాన్నతో కలిసి చేస్తున్న 3వ సినిమా ఇది. హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ గురించి మాట్లాడుతూ, నాకు ఈ సినిమా హిట్ అవ్వాలని ఎంతలా కోరుకుంటున్నానో, అను కి కూడా అంతే హిట్ అవ్వాలనుకుంటున్నాను. బాలయ్య బాబు గారి ఏజ్ నాకు తెలియదు కానీ ఆయన ఎనర్జీ మాత్రం పాతికేళ్ల కుర్రాడిలా ఉంటారు. బాలయ్య బాబుగారు నా సినిమా ఫంక్షన్ కి ఎప్పుడు నుండో పిలుద్దామనుకున్నాను, కానీ నో అంటారు అని భయపడ్డాను. అన్ స్టాపబుల్ చుశాక ఏదైతే అది అయిందని పిలిచాను ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అంటూ సినిమా టెక్నీషియన్స్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్య అతిధి నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ..
ఇక్కడికి విచ్చేసిన నందమూరి, అల్లు అభిమానులకి కలాభివందనాలు.ఇక్కడున్న డైరెక్టర్స్ అంతా మంచి సినిమాలు తిస్తూ కొత్త ఒరవడి సృష్టించారు. కళాపిపాసులకు, కళాభిమానులకి, వచ్చిన అతిరథ మహారథులకు నా హృదయపూర్వక కళాభివందనాలు. అరవింద్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు. అరవింద్ గారు మేము అంతా ఒక కుటుంబ సభ్యులం. మంచి సినిమాలు చేస్తూ గీతా ఆర్ట్స్ ను ఈ స్థాయికి తీసుకెళ్ళారు అరవింద్ గారు. అంటూ స్వర్గీయ అల్లు రామలింగయ్యగారి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

శిరీష్ ను నా షోకి గెస్ట్ గా పిలిపించి అన్ని విషయాలు కూపీ లాగుదాం. ఊర్వశివో.. రాక్షసివో చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా విడుదలై మీ ఆదరాభిమానాలు పొందాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర దర్శకుడు రాకేష్ శశి కి , మ్యూజిక్ డైరెక్టర్ కి అచ్చు రాజమణి గారికి, అనూప్ గారికి అభినందనలు తెలిపారు. కలర్ ఫుల్ గా ఉంది పిక్చర్, మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ అన్నం, వస్త్రాలు అవసరాలతో పాటు సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు. కాబట్టి ప్రేక్షకులకు ఎటువంటి సినిమాలు అందించాలి అనేది ఆలోచించాల్సిన విషయం. యాక్టింగ్ అనేది అరవడం, నవ్వడం ,ఏడవడం కాదు యాక్టింగ్ అనేది పరకాయ ప్రవేశం. ఈ పిక్చర్ బాగా ఆడాలని మనస్ఫూర్తిగా ఆడాలని కోరుకుంటున్నాను. వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి మార్చి నవంబర్ 4 కు మార్చాలి.
అను ఇమ్మాన్యూల్ అందంతో పాటు తన హావభావాలు కూడా సమపాళ్లలో కనిపించాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది, అవ్వాలని దీవిస్తూ, పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All