
ఇలియానా.. ఈ పేరు వినగానే టక్కున సన్నని నడుము గుర్తుకొస్తుంది కుర్రాళ్లకి. తన తొలి చిత్రం ‘దేవదాస్’ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి భామ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.
కేరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండగానే అమ్మడు ఓ విదేశీయుడుతో ప్రేమాయణం కొనసాగించింది. ఇప్పుడు అది బెడిసి కొట్టడంతో తిరిగి మళ్ళీ సినిమాల్లో నటిస్తానంటోంది ఇలియానా డి క్రుజ్.
చాలా కాలం తర్వాత ఇలియానా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లో రవితేజ సరసన జతకట్టింది. ఆ చిత్రం చుసిన ప్రతి ఒక్కరు ఇలియానా లావుగా వుంది, బొద్దుగా వుంది, అని కామెంట్లు చేసారు. ఇక మళ్ళి తిరిగి ఇలియానా బాంబే చెక్కేసింది.. ఓ ప్రక్క లవ్ ఫెయిల్యూర్, మరో ప్రక్క సినిమా ఛాన్సులు లేవు.. వేరే గత్యంతరం లేక ఎలాగైనా సినిమాల్లో నటించాలి నేనేంటో అందరికీ చూపించి నన్ను నేను నిరూపించుకోవాలి అని.. తెగ కసితో వుంది ఇల్లి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని దర్శక, నిర్మాతలను అడుగుతోందట.
ముందు నువ్ బరువు తగ్గు అని నిర్మాతలు, దర్శకులు సలహా ఇచ్చారని సమాచారం.. ఇక చేసిది ఏమిలేక ఫైనల్ గా ఇలియానా సన్నబడే పనిలో ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. యోగ, జిమ్, స్విమ్మింగ్ అన్ని చేస్తూ ఇలియానా తెగ కష్టపడుతుందని.. వినికిడి..!!