Homeటాప్ స్టోరీస్ఇచట వాహనములు నిలుపరాదు మూవీ రివ్యూ

ఇచట వాహనములు నిలుపరాదు మూవీ రివ్యూ

Ichata Vahanamulu Nilupa Radu Review in Telugu
Ichata Vahanamulu Nilupa Radu Review in Telugu

నటీనటులు: సుశాంత్, మీనాక్షి చౌదరి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి & తదితరులు
దర్శకుడు: ఎస్ దర్శన్
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల
సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు
రేటింగ్ : 2.25/5

హీరోగా ఎన్ని సినిమాలు చేసినా హీరో సుశాంత్ కెరీర్ ఇంకా నత్తనడకన సాగుతోంది. అయితే గతేడాది అల వైకుంఠపురములో చిత్రంలో నటించాక సుశాంత్ కు కొంత క్రేజ్ వచ్చింది. మరి ఆ క్రేజ్ ను బిల్డ్ చేసుకుని సుశాంత్ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లగలడా అనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రం ఇచట వాహనములు నిలుపరాదు. ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందామా?

- Advertisement -

కథ:
అరుణ్ (సుశాంత్) తన కంపెనీలో ఇంటర్న్ గా చేస్తోన్న మీనాక్షి (మీనాక్షి చౌదరి)ని ప్రేమిస్తాడు. ఆమె ఒక రౌడీ అలాగే స్థానిక రాజకీయనాయకుడు అయిన నరసింహా యాదవ్ (వెంకట్)కు చెల్లెలు. ఒకరోజు మీనాక్షి, అరుణ్ ను తన ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే మీనాక్షి ఇంటికి వెళ్ళబోయి వేరే ఇంటికి వెళ్తాడు అరుణ్.

కానీ అనుకోకుండా అరుణ్ వెళ్లిన ఇంట్లో ఒక క్రైమ్ జరుగుతుంది. అయితే సొసైటీ జనాలు క్రిమినల్ అక్కడే ఉన్నాడు అనుకుని ఎగ్జిట్ వేస్ ను బ్లాక్ చేసేస్తారు. క్రైమ్ సీన్ వద్ద ఉండడంతో అందరూ అరుణ్ ను అనుమానిస్తారు. ఈ పరిస్థితుల నుండి అరుణ్ ఎలా బయటపడగలిగాడు అన్నది ఈ సినిమా మిగిలిన స్టోరీ.

నటీనటులు:
సుశాంత్ తన పాత్రకు న్యాయం చేసాడనే చెప్పాలి. అయితే కొన్ని చోట్ల ఇంకా ఎనర్జిటిక్ గా చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మీనాక్షి చౌదరి పర్వాలేదు. వెన్నెల కిషోర్ కొన్ని కోట్ల కామెడీ పంచాడు. ప్రియదర్శికు ముఖ్యమైన పాత్ర దక్కింది కానీ పాత్ర పరిధి తక్కువే. అభినవ్ మెప్పిస్తాడు. చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వెంకట్ పాత్ర ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాల్సింది. కృష్ణ చైతన్య కూడా ఓకే.

సాంకేతిక నిపుణులు:
ఈ సినిమా కథ పరమ రొటీన్ వ్యవహారం. కథ మాత్రమే ఇలా ఉందనుకుంటే పొరబాటే. స్క్రీన్ ప్లే, డైలాగ్స్.. ఇలా ఎందులోనూ ఎఫెక్టివ్ నెస్ కనిపించదు. దర్శకుడు అన్నీ పైపైన టచ్ చేసుకుంటూ వెళ్లిపోయాడనిపిస్తోంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద మరింత వర్క్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం ఓకే కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లౌడ్ నెస్ ఎక్కువైంది. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ పర్వాలేదు.

చివరిగా:
ఇచట వాహనములు నిలుపరాదు టైటిల్ ఎందుకు పెట్టారో అర్ధం కాదు, అలాగే ఈ చిత్రం రాంగ్ పార్కింగ్ తో ఇబ్బంది పడింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All