
`పటాస్` సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి తొలి మూవీతో నవ్విస్తూనే సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సోమవారం ఆయన పుట్టిన రోజు. బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ `ఎఫ్ 2` కి సీక్వెల్ గా `ఎఫ్ 3` షూటింగ్ ప్రారంభించడానికి సిద్దమవుతున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఈ సీక్వెల్‌ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కానున్నాయి. డిసెంబర్ 14 నుండి చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది.
ఈ సందర్భంగా స్టార్ హీరో మహేష్ బాబు కాల్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించారు. బాబు మహేష్ బాబుతో కలిసి పనిచేయాలని ప్రతీ దర్శకుడు కోరుకుంటారు. అలాగే అనిల్ రావిపూడి కూడా కోరుకుంటున్నారు. అయితే ఆయన ఇంతకు ముందు `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అంఇంచారు. ఈ దఫా అంతకు మించిన చిత్రాన్ని అందించాలనుకుంటున్నారట.
మహేష్ కోసం ఇప్పటికే ఓ టెర్రిఫిక్ స్టోరీని రెడీ చేశారట. ఆయన ఎప్పుడు కాల్ చేస్తే అప్పడు స్టోరీ చెప్పడానికి సిద్ధంగా వున్నాడట. `నేను మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నాను. ఆయన నాకు మరో సారి దర్శకత్వం వహించే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను`అని అనిల్ రవిపూడి ఈ సందర్భంగా తన మనసులోని మాటని బయటపెట్టారు. అనిల్ రావిపూడి `గాలి సంపత్` మూవీతో నిర్మాతగా కూడా మారుతున్న విషయం తెలిసిందే. డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో శ్రీవిష్ణు హీరోగా ఈ మూవీ రూపొందుతోంది.