
స్టార్ హీరోయిన్‌ల ప్రేమ వ్యవహారాలపై నిత్యం వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కొంత మందికి ఏజ్ బార్ అవుతుండటంతో లవ్‌లో వున్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా ఇదే తరహా వార్తలు షికారు చేస్తున్నాయి. తన ప్రేమ జీవితం గురించి ఇంతకు ముందు చాలా పుకార్ల వినిపించినప్పటికీ రకుల్ ఆ వార్తలపై పెద్దగా స్పందించ లేదు.
అయితే తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం తన ప్రేమ వ్యవహారం గురించి రకుల్ స్పందించింది. తను ఎవరితో డేటింగ్‌లో లేనని, రిలేషన్ షిప్‌లో అస్సలు లేనని స్పష్టం చేసింది. `నేను ప్రస్తుతం ఎవరితోనూ ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేను`అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. దీంతో గత కొంత కాలంగా ఆమెపై వస్తున్న రూమర్‌లకు చెక్ పడింది.
రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రాన్ని పూర్తి చేసింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని `కొండ పొలం` నవల ఆధారంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి బాబు జాగర్లమూడి, వై. రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇదే కాకుండా రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.