Homeటాప్ స్టోరీస్త్వరలోనే మహేష్ తో సినిమా చేస్తానని రివీల్ చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్

త్వరలోనే మహేష్ తో సినిమా చేస్తానని రివీల్ చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్

త్వరలోనే మహేష్ తో సినిమా చేస్తానని రివీల్ చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్
త్వరలోనే మహేష్ తో సినిమా చేస్తానని రివీల్ చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో స్పేస్ సెషన్ ను నిర్వహించారు. ఈ స్పేస్ లో సందీప్ రెడ్డి కాసేపు మహేష్ అభిమానులతో ముచ్చటించారు.

అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ నుండి పిలుపు రావడంతో సందీప్ ఒక కథను చెప్పాడు. అది మహేష్ కు బాగా నచ్చినా కానీ వివిధ కారణాల వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత సందీప్ బాలీవుడ్ వెళ్ళిపోయాడు. అయితే ఈ ట్విట్టర్ స్పేస్ లో మాట్లాడుతూ, “మహేష్ తో నేను ఒక యాడ్ కు వర్క్ చేశాను.

- Advertisement -

దాని తర్వాత 4-5 సార్లు బయట కలిసాను. కానీ మనకు తెలిసిన మహేష్ కు ఈ మహేష్ కు చాలా వ్యత్యాసం ఉంది. మనకు తెల్సిన మహేష్ కేవలం 25 శాతమే. 75 శాతం మహేష్ సైడ్ మనం చూడలేదు. త్వరలోనే మహేష్ తో సినిమా చేస్తానని” సందీప్ తెలిపాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All