Homeటాప్ స్టోరీస్ఈ పరిశ్రమలో చాలా ఏళ్ళు ఉంటా .. అప్పటివరకు కలలు కంటూనే ఉంటా!!

ఈ పరిశ్రమలో చాలా ఏళ్ళు ఉంటా .. అప్పటివరకు కలలు కంటూనే ఉంటా!!

Pooja Hegde
Pooja Hegde

ముకుందా చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుపెట్టిన పూజ హేగ్దే ఆ తరువాత ఒకలైలా కోసం, దువ్వాడ జగన్నాధం, సాక్ష్యం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు తెలుగులో అలా వైకుంఠపురములో, వాల్మీకి చిత్రాల్లో మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది.

తాజాగా ఈ గ్లామరస్ బ్యూటీ.. మాట్లాడుతూ.. నా కేరియర్ ఇప్పుడే మొదలయింది. కాబట్టి నాకు కావాల్సినంత చాయిస్ వుంది. అందుకే డిఫరెంట్ పాత్రలకోసం ఎదురుచూస్తున్నాను. ఎప్పుడైనా ఓ మంచి సినిమా చూసినప్పుడు ఆ సినిమా నచ్ఛితేనో, ఆ సినిమాల్లో హీరోయిన్ పాత్ర నచ్ఛితేనో వెంటనే వారికీ ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తాను. ఆ హీరోయిన్ క్యారెక్టర్ నాకు దొరికితే బాగుండును కథా అనిపిస్తుంది.

- Advertisement -

నాకు అన్ని సినిమాల్లో చేయాలనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో నాకు స్వార్థం కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఈ సినిమా పరిశ్రమలో అది చాలా అవసరం. అలాగని నేను ఎవరిపై అసూయా పడను  పెంచుకొను. నేను ఇంకా సినీ పరిశ్రమలో చాలా ఏళ్ళు కొనసాగుతానని నా నమ్మకం.

ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నాకు రావాల్సిన సినిమాలు, నాకు అర్హతమైన పాత్రలు తప్పకుండా వస్తాయని.. అప్పటివరకు కళలు కంటూనే వుంటాను అని  చెపుతోంది సొట్ట బుగ్గల సుందరి పూజ హేగ్దే. ప్రస్తుతమ్ ఆ అమ్మడు నటించిన వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధంగా వుంది.. బాలీవుడ్లో హౌస్ ఫుల్-4 చిత్రంలో రానా కి జోడీగా నటించనుంది..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All