Homeటాప్ స్టోరీస్సుశాంత్ త‌ర‌హాలో తాను కూడా...!

సుశాంత్ త‌ర‌హాలో తాను కూడా…!

సుశాంత్ త‌ర‌హాలో తాను కూడా...!
సుశాంత్ త‌ర‌హాలో తాను కూడా…!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఆయ‌న చ‌నిపోయి దాదాపు 15 రోజుల‌వుతున్నా ఇప్ప‌టికీ అత‌ని మ‌ర‌ణంపై చ‌ర్చ జ‌రుగుతూనే వుంది. బాలీవుడ్‌లో వున్న బంధు ప్రీతి కార‌ణంగానే సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై నెటిజ‌న్స్‌, కొంత మంది సెల‌బ్రిటీలు దుమ్మెత్తిపోస్తున్నారు. సుశాంత్ మ‌ర‌ణంపై శేఖ‌ర్ క‌పూర్ నుంచి ప్ర‌కాష్ రాజ్ వ‌ర‌కు స్పందించారు.

తాజాగా విల‌క్ష‌ణ న‌టుడు మ‌నోజ్ బాజ్ స్పందించారు. త‌ను బీహార్‌లోని ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాన‌ని, పూరి గుడిసెను త‌ల‌పించే స్కూల్ లో చ‌దువుకున్నాన‌ని, సిటీకి వెళ్ల‌లేద‌ని, థియేట‌ర్ లో సినిమా చూడ‌లేద‌ని మ‌నోజ్ బాజ్ పాయ్ వెల్ల‌డించారు. 9 ఏళ్ల వ‌య‌సులో అమితాబ్ బ‌చ్చ‌న్ అంటే ఇష్టం ఏర్ప‌డింద‌ని, తాను ఆయ‌న‌కు వీరాభిమానిగా మారిపోయాన‌న్నారు.

- Advertisement -

బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నేనొక ఔట్ సైడ‌ర్‌ని. అలాంటి నేను ఇక్క‌డ నిల‌బడాలంటే ఇంగ్లీష్, హిందీ, భోజ్‌పురీ నేర్చుకోవాల‌నుకున్నాను. అందు కోసం ఎన్ ఎస్‌డీకి అప్లై చేస్తే చాలా సార్లు రిజెక్ట్ అయ్యాను. దాంతో ఏం చేయాలో తెలియ‌క తాను కూడా సుశాంత్ త‌ర‌హాలోనే హ‌త్య చేసుకోవాల‌నుకున్నాన‌ని మ‌నోజ్ బాజ్ పాయ్ సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఆ త‌రువాతే రామ్ గోపాల్ వ‌ర్మ రూపొందించిన `స‌త్య‌` త‌న‌కు బ్రేక్‌తో పాటు పాపులారిటీని తెచ్చిపెట్టింద‌ని వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All