Homeటాప్ స్టోరీస్మంచు మ‌నోజ్ పాన్ ఇండియా స్థాయిలో `అహం బ్ర‌హ్మ‌స్మి`!

మంచు మ‌నోజ్ పాన్ ఇండియా స్థాయిలో `అహం బ్ర‌హ్మ‌స్మి`!

Manchu Manoj Aham Brahmasmi a Pan India Film
Manchu Manoj Aham Brahmasmi a Pan India Film

లేట్‌గా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌స్తా అన్న‌ట్టు హీరో మంచు మ‌నోజ్ కొంత లేట్ అయినా భారీ ప్లాన్‌తో పాన్ ఇండియా స్థాయి సినిమాతో ప్రేక్ష‌కుల‌కు స‌ర్ఫ్రైజ్ ఇచ్చారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `అహం బ్ర‌హ్మ‌స్మి`. కొడ‌కు కొట్టిన బంతి రెట్టించిన మెరుపు వేగంతో తిరిగి వ‌చ్చిన‌ట్టు మంచు మ‌నోజ్ సాదా సీదా సినిమాతో రీఎంట్రీ ఇవ్వ‌కుండా భారీ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని మంచు మ‌నోజ్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మలాదేవి మంచు, మంచు మనోజ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శ్రీ‌కాంత్ ఎన్‌. రెడ్డి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇటీవ‌లే ఈ చిత్రాన్ని చేయ‌బోతున్న‌ట్టు ఫ‌స్ట్ లుక్‌ టైటిల్‌తో స్పష్టం చేశారు. ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీతో ఈ చిత్రాన్ని చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. 6న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం బుధ‌వారం రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో మ‌నోజ్ శివ‌భ‌క్తుడిగా మూడు వేరియేష‌న్స్‌తో, మెలితిప్పిన మీసం, గ‌డ్డంతో క‌నిపిస్తున్న స్టిల్ సినిమాసై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. పోస్ట‌ర్‌లో హాస్యం, రౌద్రం, శాంతంని ప్ర‌ద‌ర్శిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

ఊహ‌కంద‌ని థీమ్ లైన్‌తో కొత్త త‌ర‌హా క్యారెక్ట‌రైజేష‌న్‌తో మంచు మనోజ్ చేయ‌బోతున్న ఈ సినిమా నిజంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసేలా క‌నిపిస్తోంది. విద్యా నిర్వాణ‌. మంచు ఆనంద్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. అడిష‌న‌ల్ డైలాగ్స్ దివ్య నారాయ‌ణ‌న్‌, క‌ల్యాన్ చ‌క్ర‌వ‌ర్తి, పాట‌లు రామ‌జోగ‌య్య శాస్త్రి, అనంత‌శ్రీ‌రామ్‌, సంగీతం అచ్చు రాజ‌మ‌ణి, ర‌మేష్ త‌మిళ‌మ‌ణి, కెమెరా స‌న్నీ కూర‌పాటి, ఎడిటింగ్ త‌మ్మిరాజు, ఆర్ట్ వివేక్ ఎ.ఎం, స్టంట్స్ పీట‌ర్ హెయిన్స్‌, పీఆర్వో: వ‌ంశీ శేఖ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వెంక‌ట్ చ‌ల్ల‌గుళ్ల‌, స్టోరీ, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌కాంత్ ఎన్‌. రెడ్డి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All