Homeగాసిప్స్నేను సర్జరీ చేయించుకోలేదు అంటున్న హీరోయిన్!

నేను సర్జరీ చేయించుకోలేదు అంటున్న హీరోయిన్!

Zarine Khan
నేను సర్జరీ చేయించుకోలేదు అంటున్న హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ ‘వీర్‌’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది హీరోయిన్ జరీన్ ఖాన్‌. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో మరోసారి సల్మాన్ సరసన ‘రెడీ’ సినిమాలో నటించింది జరీన్. ఆ తర్వాత ‘హౌస్ ఫుల్ 4’ సినిమాలో నటించి మెప్పించింది ఈ ముంబై ముద్దుగుమ్మ జరీన్ ఖాన్.

ప్రస్తుతం ఈ భామ గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ‘చాణక్య’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫోటో షేర్ చేస్తూ దానికి ‘సిటీ ఆఫ్ లేక్స్’ అని కాప్షన్ ఇచ్చింది. జరీనా షేర్ చేసిన ఈ ఫొటోలో ఆమె పొట్ట భాగం ముడతలు పడినట్లుగా కనిపించడంతో దీనిపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ పిక్ నెట్టింట హాట్ టాపిక్ అయింది. ‘పొట్టపై ఆ కుట్లు ఏంటి మేడం? బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకు న్నావా..? అయినా అంతలా లావెక్కడం దేనికి’ అంటూ ఆమెపై రెచ్చిపోయి ట్రోల్స్ చేశారు నెటిజన్లు.

- Advertisement -

ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు కామెంట్స్ చేయడం చూసిన జరీనా ఖాన్ ఇక లాభం లేదని అదే సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘నా పొట్ట భాగాన్ని చూసి చాలా మంది ఉత్సాహం కామెంట్లు పెడుతున్నారు. వాళ్లందరికీ నా పొట్ట భాగంలో ఏమైందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. సాధారణంగా 50 కిలోలకు పైగా బరువు తగ్గిన ఏ వ్యక్తి పొట్ట అయినా సహజంగా ఇలానే ఉంటుంది. నేను ఈ ఫొటోను ఫొటోషాప్‌ చేసి మెరుగులు దిద్దలేదు, అలాగే సర్జరీ కూడా చేయించుకోలేదు.

నా అసలైన శరీర సౌందర్యాన్ని మాత్రమే నేను ఇష్టపడతాను. ఒకవేళ నా శరీరంలో ఏవైనా లోపాలున్నా వాటిని కవర్‌ చేయడం నాకు ఇష్టముండదు. దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టకండి” అంటూ నెటిజన్లకు దిమ్మతిరిగే కౌంటర్ వేసింది జరీనా ఖాన్. తనపై వచ్చిన ట్రోల్స్‌పై జరీనా ఖాన్ స్పందన చూసి పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ ఆమెను అభినందిస్తున్నారు. జరీనా ఖాన్ నువ్ చాలా ధైర్యవంతురాలివి అంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఆమెకి మద్దతు తెలపడం విశేషం…!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All