
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కథానాయకులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అంతే పరిధిలో హాస్య కథానాయకులకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే కథానాయకుడికి పక్కన ఉంటే అటు కథానాయకులకు, ఇటు హాస్య కథానాయకులకు బాగుంటుంది. ఒకప్పుడు కథలో కీలకంగా ఉండాలి అని హాస్య కథానాయకులకు పాత్ర పరిధి పెంచేవారు.
అలాంటి హాస్య కథానాయకుడు ‘వేణు మాధవ్‘ చనిపోయిన తర్వాత, తెలుగు పరిశ్రమ ఒక్కసారిగా కన్నీటి వీడ్కోలు పలికింది. ఇక తనని రోజు రోజుకి తలుచుకుంటూ తనతో ఉన్న అనుబంధాల్ని నెమరువేసుకుంటున్నారు. అలా హాస్య కథానాయకుడు ‘వెన్నెల కిషోర్’ కూడా వేణు మాధవ్ గురించి తలుచుకొని మాట్లాడాడు.
మొన్న ఆదివారం రాత్రి ‘సంతోషం 17వ’ సౌతిండియా అవార్డ్స్ పండగ ఆడంబరంగా జరిగింది. అందులో వెన్నెల కిషోర్ కి పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘అల్లు రామలింగయ్య’ గారి జ్ఞాపకార్ధం అవార్డు దక్కింది. అది కేవలం హాస్య కథానాయకులకు దక్కే అరుదైన గౌరవం అని మనకి తెలుసు. తనకి ఆ అవార్డు వచ్చినందుకు సంతోషాన్ని చెపుతూ, అవార్డు ని నా మిత్రుడు “వేణు మాధవ్” కి అంకితం చేస్తున్నా అని సభా ముకంగా పలికాడు. నిజంగా అలా అన్నప్పుడు ఒక్కసారిగా మళ్ళి వేణుతో ఉన్న అనుబంధాన్ని అందరూ నెమరువేసుకున్నారు.