
‘అర్జున్ రెడ్డి’ తో యావత్ ప్రపంచాన్ని నిద్రలేపాడు ‘విజయ్ దేవరకొండ‘. అంతకుముందు వరకి ‘లైఫ్ ఇస్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ లాంటి సినిమాలలో మంచిగా పక్కింటి కుర్రాడిలా చలాకీతనంతో తన నటనని కనబరిచి కూల్ గా అనిపించాడు. ఇక ఎప్పుడైతే ‘సందీప్ వంగ’ దర్శకుడితో కలిసి అర్జున్ రెడ్డి తీసాడో, వచ్చే సినిమాలు కూడా అలానే యువతని మేల్కొలపాలి అని దర్శకులకి చెప్తున్నాడు అంటా.
సినిమాలు అన్ని అలాగే ఉంటె కష్టం అంటున్నారు దర్శకులు, వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకుండా నాకు యువతని ప్రశ్నించే, లేక యువతని ప్రేరేపించే సినిమాలు తియ్యాలని అంటున్నాడు అంటా. మరి మన దర్శకులు మాత్రం అలాంటి కథలే కావాలంటే కుదరదు అంటున్నారు. తన నెక్స్ట్ సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా లుక్ కూడా అలాగే అర్జున్ రెడ్డి ని పోలివుండటం చూసి విజయ్ సాయి క్రాంతి మాధవ్ కి….తనని రెబల్ తరహా పాత్రల్లో చూడ్డానికి యూత్ ఇష్టపడుతున్నారు కనుక ఈ చిత్రంలోను గడ్డం పెంచి కనిపించే ఫేజ్ ఒకటి వుండాలని ఒప్పించాడని అంటున్నారు సినిమా సభ్యులు.
మరి అలా అయితే అప్పుడప్పుడు గీత గోవిందం లాంటి కథలు తెచ్చిన పర్లేదు నాకు అవి బూస్ట్ అప్ లాంటి సినిమాలు అంటున్నారు అంటా మన విజయ్ సాయి. ఆలోచన మంచిదే కానీ ఈ విషయంలో తనని రైట్‌గా గైడ్ చేసేవాళ్లు లేకపోవడం, సినీమా మీద ఉన్న నేపథ్యం విజయ్ కి తగిన అర్హత లేకపోవడం కూడా దీనికి కారణమే అని విశ్లేషకులు అంటున్నారు.
అలాగే తన మాట చెల్లుబాటు అయ్యే దర్శకులతోనే చేస్తున్నాడు తప్ప తనని కమాండ్ చేసే వారికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఉదాహరణకి మొన్న జరిగిన హరీష్ శంకర్ గారి ‘గద్దలకొండ గణేష్’ సక్సెస్ మీట్ ఇంటర్వ్యూ లో హరీష్ గారు విజయ్ సాయి గురించి చెప్పిన మాటలు ఉదాహరణ.