Homeటాప్ స్టోరీస్"ఈ ఈవెంట్ కు చైతన్య కోసమే వచ్చాను": ఆమిర్ ఖాన్

“ఈ ఈవెంట్ కు చైతన్య కోసమే వచ్చాను”: ఆమిర్ ఖాన్

"ఈ ఈవెంట్ కు చైతన్య కోసమే వచ్చాను": ఆమిర్ ఖాన్
“ఈ ఈవెంట్ కు చైతన్య కోసమే వచ్చాను”: ఆమిర్ ఖాన్

నిన్న లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ ఈ ఈవెంట్ కు ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పాడు. “లవ్ స్టోరీ చిత్ర ట్రైలర్ ను నాలుగు రోజుల క్రితం చైతన్య చూపించాడు. నాకు చాలా నచ్చింది.

అలాగే 19న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని తెలిపాడు. నేను కచ్చితంగా వస్తాను అని చెప్పాను. నాగ చైతన్యను మొదటి సారి లాల్ సింగ్ చద్దా సెట్స్ లో చూసినప్పుడు ఇదివరకే చాలా సార్లు కలిసినట్లు అనిపించింది. నాగ చైతన్య చాలా మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. నా జీవితంలో నేను కలిసిన మంచి వ్యక్తుల్లో నాగ చైతన్య ఒకరు. ఆయన పేరెంట్స్ కు కృతఙ్ఞతలు చెప్పాలి” అని ఆమిర్ ఖాన్ అన్నాడు.

- Advertisement -

నాగ చైతన్య, ఆమిర్ ఖాన్ కలిసి లాల్ సింగ్ చద్దాలో నటించింది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 24న విడుదల కానున్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All