Thursday, October 6, 2022
Homeటాప్ స్టోరీస్గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు నేను సిద్ధం:  సుర‌భి

గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు నేను సిద్ధం:  సుర‌భి

గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు నేను సిద్ధం:  సుర‌భి
గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు నేను సిద్ధం:  సుర‌భి

ఎక్స్‌ప్రెస్ రాజా, జెంటిల్‌మన్ చిత్రాలతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది సుర‌భి. ఆ త‌రువాత చేసిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాయి. గ‌త కొంత కాలంగా క‌థానాయిక‌గా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `శ‌శి`. ఆది హీరోగా న‌టిస్తున్నాడు. శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని పాట‌లు యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ సుర‌భి శ‌నివారం మీడియాతో ముచ్చ‌టించింది. త‌మిళ చిత్రాల్లో న‌టించ‌డం వ‌ల్ల తెలుగులో కొంత గ్యాప్ ఏర్ప‌డింద‌ని, ఇక‌పై తెలుగు చిత్రాల‌కే తొలి ప్రాధాన్య‌త ఇస్తాన‌ని చెబుతోంది.
నట‌న‌కు ఆస్కారం వున్న పాత్రలు చేయడం తనకు ఇష్టమని సురభి తెలిపింది. ఇది రెగ్యుల‌ర్ ల‌వ్ స్టోరీ కాదు. ఎమోష‌న్స్, ఇంటెన్స్‌తో కూడుకున్న ప్రేమ‌క‌థ‌. సినిమాలో న‌ట‌న‌కు మంచి స్కోప్ వున్న పాత్ర నాది. సినిమాలో నాకు ఫాద‌ర్‌గా రాజీవ్ క‌న‌కాల న‌టించారు. ఇందులో ఒక్క‌గానొక్క కూతురిగా న‌టించాను.

మా అమ్మానాన్న‌ల‌కు నేను ఒక్క‌దాన్నే కావ‌డంతో వెంట‌నే ఈ స్టోరీకి క‌నెక్ట్ అయ్యాను. ఇందులో నా పాత్రకు టు షేడ్స్ వుంటాయి. రెండ‌వ షేడ్ ఏంట‌న్న‌ది సినిమాలో చూడాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎమోష‌న‌ల్‌గా వుంటుంది. సినిమాలో ప్ర‌తీ పాత్ర‌కు ప్రాధాన్య‌త వుంటుంది. ఆది ఈ మూవీ విష‌యంలో చాలా స‌పోర్ట్ చేశారు. వెరీ నైస్ ప‌ర్స‌న్‌. డైన్ టు ఎర్త్‌.

గ్లామరస్ పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని నటి సుర‌భి స్ప‌ష్టం చేసింది.  ఇండ‌స్ట్రీలో వున్న గ్రేట్ పీపుల్స్‌తో క‌లిసి న‌టించాల‌ని వుంది. మైథ‌లాజిక‌ల్ చిత్రాల్లో న‌టించాల‌ని వుంది. వెబ్ సిరీస్‌ల‌లో న‌టించ‌మ‌ని కొన్ని ఆఫ‌ర్లు వ‌చ్చాయి కానీ న‌ట‌న‌కు స్కోప్ వున్న పాత్ర‌లైతేనే న‌టించాల‌ని వ‌దులుకున్నాను` అని తెలిపింది సుర‌భి.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts