Homeన్యూస్హైదరాబాద్ నవాబ్స్ 2 రివ్యూ

హైదరాబాద్ నవాబ్స్ 2 రివ్యూ

hyderabad nawabs 2 review in telugu
hyderabad nawabs 2 review in telugu

హైదరాబాద్ నవాబ్స్ 2 రివ్యూ:
నటీనటులు : ఆర్ కే , అలీ
సంగీతం : రాజేష్
నిర్మాత : ఆర్ కే
దర్శకత్వం : ఆర్ కే
రేటింగ్ : 3/ 5 

సంచలన విజయం సాధించిన హైదరాబాద్ నవాబ్ చిత్రానికి సీక్వెల్ గా హైదరాబాద్ నవాబ్స్ 2 చిత్రం చేసారు . ఆర్ కే ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ : 
ఓల్డ్ సిటీ లో ఉండే మున్నా (అలీ ) రేష్మ ( ఫరా ఖాన్ ) ని ప్రేమిస్తాడు . అయితే మున్నా – రేష్మ ల ప్రేమకు ఆమె తండ్రి ఒప్పుకోడు , సొంత ఇల్లు ఉంటేనే పిల్లనిస్తాను అని కండిషన్ పెడతాడు . దాంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్ పప్పు తో కలిసి సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తూ మోసపోతాడు . రియల్ ఎస్టేట్ లో జరుగుతున్న మోసాలను అరికట్టి మామ (ఆర్ కే ) వాళ్లకు ఎలా బుద్ది చెప్పాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ : 
ఎంచుకున్న కథ
ఎంటర్ టైన్ మెంట్
నిర్మాణ విలువలు
ఆర్ కే
అలీ

విశ్లేషణ : 
రియల్ ఎస్టేట్ పేరుతో జరుగుతున్న మోసాలను కళ్ళకు కట్టినట్లు చూపించే మంచి ప్రయత్నం చేసాడు . అలాగే కేవలం సీరియస్ గా ఈ అంశాన్ని చెప్పకుండా ఎంటర్ టైన్ మెంట్ ని జోడించి ఆకట్టుకునేలా తీర్చి దిద్దాడు ఆర్ కే . హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హైదరాబాద్ నవాబ్ చిత్రానికి మంచి కొనసాగింపు అనే చెప్పాలి . రాజేష్ అందించిన పాటలు బాగున్నాయి అలాగే నేపథ్య సంగీతం తో కూడా ఆకట్టుకున్నాడు . విజువల్స్ బాగున్నాయి , నిర్మాణ విలువలు కూడా . హైదరాబాద్ నవాబ్స్ 2  మంచి క్వాలిటీ తో రూపొందించారు . ఇక నటీనటుల విషయానికి వస్తే …….. ఆర్ కే పెద్దన్న పాత్ర పోషించి మెప్పించాడు . అలాగే అలీ తో పాటుగా ఇతర నటీనటులు కూడా అద్భుతంగా నటించి మెప్పించారు .

ఓవరాల్ గా : 
నవ్వించే చిత్రం …. మెప్పించే చిత్రం ఈ హైదరాబాద్ నవాబ్స్ 2

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All