Homeఎక్స్ క్లూసివ్యూత్ ని ఆకట్టుకునే సినిమా హుషారు

యూత్ ని ఆకట్టుకునే సినిమా హుషారు

Husharu film pre release event యూత్ ని టార్గెట్ చేస్తూ రూపొందించిన చిత్రం హుషారు . ఈనెల 14 న విడుదల అవుతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హోటల్ దసపల్లా లో జరిగింది . ఈ వేడుకకు ముఖ్య అథితిగా దర్శకులు వివివినాయక్ హాజరై హుషారు చిత్రం ” సినిమా చూపిస్త మావ ” అంత హిట్ కావాలని ఆకాంక్షించారు . కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పెద్ద సినిమాల తరహాలో విడుదల చేస్తూ విజయం సాధిస్తున్న బెక్కెం వేణుగోపాల్ అంటే సినిమారంగంలో అందరికీ ఇష్టమే ఈ హుషారు కూడా మంచి హిట్ అయి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నామన్నారు వినాయక్ .

బెక్కెం వేణుగోపాల్ కు నిర్మాతగా ఇది తొమ్మిదో సినిమా దాంతో ఈ యూత్ ఫుల్ చిత్రంపై చాలా ధీమాగా ఉన్నారు . కొత్తవాళ్లతో సినిమా తీయడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నాను . ఇక ఈ  సినిమాని డిసెంబర్ 14 న విడుదల చేస్తున్నాం తప్పకుండా హిట్ కొడతామన్న నమ్మకం ఉందన్నారు నిర్మాత  బెక్కెం వేణుగోపాల్ . తేజస్ కంచర్ల , తేజు కూరపాటి , అభినవ్ మంచు , దినేష్ తేజ్ , దక్ష నాగార్కర్ , ప్రియా వడ్లమాని , హేమ ఇంగ్లే ,రాహుల్ రామకృష్ణ తదితర తారాగణంతో తెరకెక్కిన ఈ హుషారు చిత్రానికి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు . యువతని ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ చిత్ర బృందం .

English Title: Husharu film pre release event

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All