Homeటాప్ స్టోరీస్బుల్లితెరపై సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ

బుల్లితెరపై సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ

Huge rating for vijay devarakonda' s geetha govindam on small screenవిజయ్ దేవరకొండ నటించిన సంచలన చిత్రం గీత గోవిందం . పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదలై సంచలన వసూళ్లు సాధించింది . కొంతమంది అగ్ర హీరోలకు సైతం వీలుకాని వంద కోట్ల ని అవలీలగా సాధించి చరిత్ర సృష్టించాడు విజయ్ దేవరకొండ . తాజాగా ఈ చిత్రాన్ని జీ తెలుగు లో ప్రసారం చేసింది . కాగా ఈ చిత్రానికి అత్యధికంగా 20. 5 రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది . 20 కి పైగా టిఆర్పి రావడం అంటే మాములు విషయం కాదు . అగ్ర హీరోలు నటించిన చిత్రాలకు మాత్రమే సాధ్యమయ్యే రేటింగ్ విజయ్ దేవరకొండ అవలీలగా సాధించేసాడు .

ఈ సినిమాని జీ తెలుగు వాళ్ళు కొనుక్కున్నారు . వెండితెర పై భారీ విజయం సాధించిన గీత గోవిందం బుల్లితెరపై కూడా ప్రభంజనమే సృష్టించింది అని చెప్పాలి అందుకే ఈ సినిమాని మళ్ళీ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇంతకుముందు జీ తెలుగు పలు ఫ్లాప్ చిత్రాలను కొని తీవ్రంగా నష్టపోగా గీత గోవిందం మంచి విజయాన్ని ఇవ్వడమే కాకుండా మంచి రేటింగ్ ని కూడా ఇచ్చి జీ కి గౌరవాన్ని తెచ్చింది .

- Advertisement -

English Title: Huge rating for vijay devarakonda’ s geetha govindam on small screen

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All