Homeటాప్ స్టోరీస్భారీ లాభాలను తెచ్చిపెడుతున్న తొలిప్రేమ

భారీ లాభాలను తెచ్చిపెడుతున్న తొలిప్రేమ

huge profit for tholiprema producerనిర్మాత భోగవల్లి ప్రసాద్ కు ఆమధ్య అల్లరి నరేష్ తో తీసిన ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే సినిమా నష్టాలను మిగిల్చింది కట్ చేస్తే ఇప్పుడు తొలిప్రేమ చిత్రం భారీగా లాభాలను తెచ్చిపెడుతోంది . తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ తొలిప్రేమ చిత్రం ఏకంగా 20 కోట్ల కు పైగా షేర్ వచ్చేలా వసూళ్ల ని సాధిస్తోంది . వరుణ్ తేజ్ కు ఫిదా చిత్రం తర్వాత వచ్చిన ఈ చిత్రం ఆ విజయాన్ని కంటిన్యూ చేస్తూ మరో సూపర్ హిట్ ని అందించింది . బాబాయ్ కి తొలిప్రేమ ఎంత పెద్ద హిట్టో అబ్బాయ్ కు కూడా అంత పెద్ద హిట్ అవ్వడం కాకతాళీయమే అయినప్పటికీ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆ జోష్ కనిపిస్తోంది .

హీరోగా పరిచయమైన వెంకీ అట్లూరి నటన మానేసి దర్శకత్వం చేపట్టి తొలిచిత్రం తోనే భారీ హిట్ కొట్టాడు . రాశి ఖన్నా కు కూడా నటి గా చాలా మంచి పేరు వచ్చింది ,వరుణ్ తేజ్ – రాశి ఖన్నా ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో , యూత్ ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఉండటంతో తొలిప్రేమకు యువత నీరాజనాలు పడుతోంది .  ఇక నిర్మాత విషయానికి వస్తే ఈ ప్రేమ కథా చిత్రం భారీ లాభాలను తెచ్చిపెడుతోంది . భారీ చిత్రాలు భోగవల్లి ప్రసాద్ ని అప్పుల పాలు చేస్తే చిన్న చిత్రంగా వచ్చిన తొలిప్రేమ మాత్రం లాభాల పంట పండిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All