Homeటాప్ స్టోరీస్భారీ ఓపెనింగ్స్ సాధించిన సంజు

భారీ ఓపెనింగ్స్ సాధించిన సంజు

huge openings for ranbir kapoor sanjuనిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సంజు చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి . ఓవరాల్ గా వరల్డ్ వైడ్ దాదాపు 40 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించినట్లు తెలుస్తోంది . బాలీవుడ్ లో సంజు చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది , దాంతో ఈ ఓపెనింగ్స్ సాధ్యమయ్యాయి . బాలీవుడ్ లో బయోపిక్ లు ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే , తాజాగా ఆ కోవలో సంజు చిత్రం కూడా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . సంజయ్ దత్ పాత్రకు ప్రాణం పోశాడు రణ్ బీర్ కపూర్ దాంతో అతడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది .

ఓవర్ సీస్ లో సైతం ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఆ చిత్ర బృందం చాలా చాలా సంతోషంగా ఉంది . రణ్ బీర్ కపూర్ , అనుష్క శర్మ , సోనమ్ కపూర్ , దియా మీర్జా , మనీషా కోయిరాలా , పరేష్ రావెల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించాడు . వరుస ప్లాప్ లతో కెరీర్ పరంగా సతమతం అవుతున్న రణ్ బీర్ కపూర్ నట జీవితంలోనే సంజు ఓ మైలురాయి గా నిలిచి పోనుంది . నటన పరంగా మాత్రమే కాకుండా , కలెక్షన్ల పరంగా కూడా రణ్ బీర్ కపూర్ కు భారీ ఊరట నిస్తోంది సంజు . మొదటి రోజున దాదాపు 40 కోట్ల గ్రాస్ వసూల్ అయినట్లు సూచన ప్రాయంగా తెలుస్తోంది . అయితే మరికొద్ది గంటల్లో అసలు లెక్కలు తేలనున్నాయి . మొత్తానికి సంజు బయోపిక్ పరాజయాల బాటలో ఉన్న బాలీవుడ్ కు ఒయాసిస్ లాంటిదని అంటున్నారు . ఉత్తరాది న మాత్రమే కాకుండా దక్షిణాదిన కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి అలాగే పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చేసింది కాబట్టి అవలీలగా రికార్డుల మోత మోగడం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All