Homeటాప్ స్టోరీస్బయ్యర్లకు భారీ నష్టాలే

బయ్యర్లకు భారీ నష్టాలే

huge loss for nela ticket buyersమాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన ” నేల టిక్కెట్టు ” ని కొనుక్కున్న బయ్యర్లకు భారీ నష్టాలు వస్తున్నాయి . మొదటి రోజునే ప్లాప్ టాక్ వచ్చింది ఈ సినిమాకు దాంతో కలెక్షన్లు ఘోరంగా పడిపోయాయి . మొదటి రోజున 4 కోట్ల లోపు షేర్ వచ్చింది అంతటా కలిసి అంటే ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . మొదటి రోజునే కలెక్షన్లు పెద్ద ఎత్తున డ్రాప్ అయ్యాయి , అయితే శని , ఆదివారాలు ఉండటంతో కొంత బెటర్ అని భావించారు కానీ వీకెండ్స్ కూడా రవితేజ కు కలిసి రాలేదు .

సోగ్గాడే చిన్నినాయనా , రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కావడంతో నేల టిక్కెట్టు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . రవితేజ హీరో కాబట్టి మినిమమ్ గ్యారెంటీ అని అనుకున్నారు కట్ చేస్తే …… నేల టిక్కెట్టు నేల ని నాకించేసింది బయ్యర్ల ని . బయ్యర్లు సేఫ్ కావాలంటే దాదాపు 30 కోట్ల షేర్ రావాలి కానీ మూడు రోజుల్లో అయిదు కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది . రానున్న రోజుల్లో కలెక్షన్లు రాబట్టడం కూడా కష్టమే ! దాంతో నేల టిక్కెట్టు బయ్యర్లు భారీగా నష్టపోవడం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All