Homeటాప్ స్టోరీస్దర్శకులు అనిల్ రావిపూడికి కష్టాలు

దర్శకులు అనిల్ రావిపూడికి కష్టాలు

Huge demond for Anil ravipudi దర్శకులు అనిల్ రావిపూడి కి కొత్తగా కష్టాలు వచ్చి పడ్డాయి . అయితే ఈ కష్టాలు చాలా ప్రత్యేకమైనవి ఎందుకంటే ఇవి సక్సెస్ ఇచ్చిన కష్టాలు సుమా ! వరుసగా నాలుగు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి . పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసాడు . అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కు సూపర్ హిట్ ఇచ్చాడు . దాని తర్వాత కష్టాల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ కు సుప్రీమ్ రూపంలో సూపర్ హిట్ ఇచ్చాడు .

ఇక రవితేజ సంగతి తెలిసిందే . రవితేజ కూడా ప్లాప్ లతో సతమతం అవుతున్న నేపథ్యంలో రాజా ది గ్రేట్ ఇచ్చి సక్సెస్ ఇచ్చాడు . ఇక ఇప్పుడేమో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్, దిల్ రాజు లకు ఎఫ్ 2 అంటూ సక్సెస్ ఇచ్చి హాట్ కేక్ అయ్యాడు . దాంతో అనిల్ రావిపూడి తో సినిమాలు తీయడానికి పలువురు నిర్మాతలు , హీరోలు వెంట పడుతున్నారు . సక్సెస్ ఇచ్చిన అనిల్ తో సినిమాలంటూ పెద్ద పెద్ద వాళ్ళు వెంట పడుతుంటుంటే ఎవరితో సినిమా చేయాలో తెలీక ఇబ్బంది పడుతున్నాడు అనిల్ రావిపూడి . ఇది సక్సెస్ తెచ్చిన కష్టం అన్నమాట .

- Advertisement -

English Title: Huge demond for Anil ravipudi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All