నందమూరి బాలకృష్ణ తాజాగా ” ఎన్టీఆర్ ” బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బిజినెస్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది . తెలుగుజాతి పౌరుషాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడి కథ కావడంతో పాటుగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కూడా తోడవ్వడంతో ఎన్టీఆర్ బయోపిక్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది . ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మళ్ళీ రెండో షెడ్యూల్ కి రెడీ అవుతోంది . బాలకృష్ణ తో పాటుగా మోహన్ బాబు , విద్యాబాలన్ , రానా , సుమంత్ , సత్యనారాయణ , క్రిష్ , సుధీర్ బాబు , రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటుగా పలువురు ప్రముఖులు నటిస్తున్నారు దాంతో ఈ సినిమాకు ఎక్కడాలేని క్రేజ్ ఏర్పడింది .
ఇక ఈ సినిమాకు అప్పుడే థియేట్రికల్ రైట్స్ పరంగా రికార్డ్ స్థాయిలో వంద కోట్లకు పైగా బిజినెస్ ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది . తెలుగు , హిందీ , తమిళ్ బాషలలో విడుదల కానున్న ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది . ఇది కేవలం థియేట్రికల్ రైట్స్ పరంగా మాత్రమే ! ఇంకా శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ పరంగా కూడా భారీ మొత్తంలో రానున్నాయి . ఏరియాల వారీగా వంద కోట్లకు పైగా బిజినెస్ అంటే పిచ్చ క్రేజ్ అన్నమాటే ఎన్టీఆర్ బయోపిక్ కు . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2019 జనవరి 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు బాలయ్య .
English Title: huge business offers for ntr biopic