Homeటాప్ స్టోరీస్శైలజారెడ్డి అల్లుడు బిజినెస్

శైలజారెడ్డి అల్లుడు బిజినెస్

Huge business for Shailajareddy alluduఅక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన శైలజారెడ్డి అల్లుడు ఈనెల 13న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించడంతో మంచి క్రేజ్ వచ్చింది బిజినెస్ వర్గాల్లో దాంతో అన్ని ఏరియాల్లో హాట్ కేక్ అయ్యింది శైలజారెడ్డి అల్లుడు చిత్రం . నాగచైతన్య సరసన అనుపమా పరమేశ్వరన్ నటించగా సీనియర్ నరేష్ , 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు . వినోద ప్రధానంగా తెరకెక్కిన చిత్రం కావడంతో బయ్యర్లు పోటీ పడి సినిమాని కొనుక్కున్నారు . దాంతో 24. 9 కోట్ల బిజినెస్ జరిగింది ప్రపంచ వ్యాప్తంగా . కేవలం థియేటర్ రైట్స్ కే ఇంత భారీ మొత్తం రావడంతో శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , డబ్బింగ్ రైట్స్ రూపంలో బాగానే వచ్చాయి ఇవే కాకుండా రేపు సినిమా హిట్ అయితే రీమేక్ రైట్స్ కూడా వస్తాయి . అయితే ఈ సినిమాని కొనుక్కున్న బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే 25 కోట్ల షేర్ రావాలి , అంతటి షేర్ రావాలంటే 45 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి మరి .

ఇక ఏరియాల వారీగా శైలజారెడ్డి అల్లుడు బిజినెస్ ఎలా ఉందో ఓ లుక్కేద్దామా !
నైజాం – 6. 50 కోట్లు
సీడెడ్ – 3 కోట్లు
వైజాగ్ – 2. 25 కోట్లు
ఈస్ట్ – 1. 62 కోట్లు
వెస్ట్ – 1. 26 కోట్లు
కృష్ణా – 1. 53 కోట్లు
గుంటూరు – 1. 71 కోట్లు
నెల్లూరు – 0. 72 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 2. 25 కోట్లు
ఓవర్ సీస్ – 3. 25 కోట్లు

- Advertisement -

మొత్తం – 24. 09 కోట్లు

English Title: Huge business for Shailajareddy alludu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All