
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ సినిమాలతో బిజీ గా ఉన్నారు. వాటిలో ‘రాధే శ్యామ్’ రిలీజ్ కు సిద్ధమైంది. మార్చి 11 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇక సెట్స్ ఫై ‘ఆది పురుష్’ .. ‘సలార్’ పాన్ ఇండియా స్థాయిలో పలకరించనున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్టు K’ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సూపర్ హీరోగా కనిపించనున్నాడు. వీటితో పాటు సందీప్ వంగ డైరెక్షన్లో స్పిరిట్ ప్రకటించారు. కానీ ఈ సినిమా కంటే ముందు మారుతీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకరావాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కోసం అత్యంత భారీ స్థాయిలో సెట్స్ నిర్మిస్తున్నారట. ఈ భారీ సెట్స్‌లో షూటింగ్ మొదలవబోతుందని..త్వరలోనే ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి..రెగ్యులర్ షూటింగ్ సహా ఇతర వివరాలను వెల్లడించనున్నారని సమాచారం.
ఇప్పటివరకు మారుతి భారీ బడ్జెట్ సినిమాలకు దర్శకత్వం వహించింది లేదు. అలాంటిది ఏకంగా ప్రభాస్‌ను లైన్‌లో పెట్టారనగానే అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. కథ ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉందట. అందులో ఒక హీరోయిన్‌గా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీలను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం.