Homeన్యూస్పుష్ప హిందీ వెర్షన్ విషయంలో రిస్క్ చేస్తున్నారా?

పుష్ప హిందీ వెర్షన్ విషయంలో రిస్క్ చేస్తున్నారా?

పుష్ప హిందీ వెర్షన్ విషయంలో రిస్క్ చేస్తున్నారా?
పుష్ప హిందీ వెర్షన్ విషయంలో రిస్క్ చేస్తున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో ప్యాన్ ఇండియా వైడ్ గా సినిమా చేయాలని అనుకున్నాడు. సుకుమార్ తో ఈ విషయం గురించి చర్చించి కథలో కీలక మార్పులు చేసి దానికి ఆ స్పాన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పుష్ప ప్రాజెక్ట్ ను రెండు భాగాలుగా కూడా విభజించారు. పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా భారీగానే సాగుతున్నాయి.

పుష్ప ది రైజ్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ప్రమోషన్స్ సజావుగానే సాగుతున్నాయి కానీ హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కు బ్రేక్ పడినట్లయింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ విషయంలో చిన్న సమస్య ఏర్పడింది. దీంతో పుష్ప హిందీలో విడుదల కాదు అనుకున్నారు కానీ ఆ సమస్యను పరిష్కరించే దిశగా పుష్ప టీమ్ ప్రయత్నిస్తోంది. పుష్ప కచ్చితంగా హిందీలో కూడా విడుదలవుతుందని టీం భావిస్తోంది.

- Advertisement -

అందుకే హిందీ వెర్షన్ విషయంలో ప్రమోషన్స్ కు భారీగానే ఖర్చు పెట్టాలని బడ్జెట్ కేటాయించారు. నార్త్ లో రెండు భారీ ఈవెంట్స్ చేయాలని భావిస్తున్నారు. అలాగే దుబాయ్ లో ఇంటర్నేషనల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ ఈవెంట్ ఉంటుంది. కేవలం హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కోసమే 20 కోట్లను కేటాయించినట్లు సమాచారం. మూడు పెద్ద బాలీవుడ్ ఏజెన్సీస్ ను కూడా ఈ విషయం గురించే సంప్రదించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో డీల్ సెట్ అవుతుంది.

Also Read:

పుష్పక విమానం టైటిల్ పర్మిషన్ సింగీతంను అడిగితే…

పుష్ప: దాక్షాయణిగా షాక్ ఇచ్చిన అనసూయ

పుష్ప మంగళం శ్రీనుగా సునీల్.. లుక్కు అదుర్స్..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All